(Jagan Review) అమరావతి: సీఎం జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఇవాళ విద్యాశాఖపై సమీక్ష జరిపారు. ఈ సమీక్షకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
నాడు-నేడు పథకం కింద పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, క్రీడా మైదానాల అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బందిని నియమించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
సమీక్ష అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యా కానుక మూడో విడత విద్యా కిట్లను వేసవి సెలవుల్లో అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అవసరమైన టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి కిట్ల తయారీలో నిమగ్నమైన ఏజెన్సీలకు వర్క్ ఆర్డర్లు ఇవ్వాలని ఆదేశించారు.
జగనన్న అమ్మ ఒడి, విద్యా దీవెన పథకాలకు అర్హులైన వారిని గుర్తించేందుకు జాబితా సిద్ధం చేయాలని సూచించినట్లు చెప్పారు. జగనన్న విద్యా కానుక కిట్ పథకం కింద 1 నుంచి 10వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థికి మూడు జతల యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, జత బూట్లు, రెండు జతల సాక్స్‌లు, బెల్టులు, స్కూల్ బ్యాగ్‌తో కూడిన కిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది.
చాతిలో నొప్పి వస్తే అది గ్యాస్ట్రిక్ సమస్యా? గుండెనొప్పా?
కళ్లు పొడిబారుతున్నాయా..? తస్మాత్ జాగ్రత్త!
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
మీ జీవితభాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
చర్మంపై దద్దుర్లు, దురద ఉంటే.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..