(Carona to card Players) రాజమండ్రి : సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో కోస్తా జిల్లాల్లో ఉత్సాహం వెల్లివిరుస్తున్నది. ఆటాపాటలు పెరిగిపోతున్నాయి. మద్యం, మాంసం అమ్మకాలు జోరందుకున్నాయి. వీటన్నింటికి తోడుగా కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. తూర్పు గోదావరి జిల్లా వెదిరేశ్వరంలో పేకాడేందుకు వెళ్లిన కొందరు జూదగాల్లు కరోనా కోరలకు చిక్కారు.
రావులపాలెం మండలం వెదిరేశ్వరంలోని ఒక రహస్య ప్రాంతంలో పేకాట జోరుగా సాగుతున్నది. వివిధ ప్రాంతాల నుంచి పేకాటరాయుళ్లు వెదిరేశ్వరం వచ్చి మరీ పేకాట ఆడుతున్నట్లు తెలుస్తున్నది. అయితే, రెండు రోజుల క్రితం పేకాట ఆడిన 9 మంది జ్వరానికి గురయ్యారు. బెదిరిపోయిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవడంతో వారందరికీ పాజిటీవ్‌గా తేలింది. వీరంతా ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. పేకాటకు వచ్చిన ఒకరి ద్వారా 9 మందికి వ్యాపించినట్లుగా తెలుస్తున్నది. దాంతో వెదిరేశ్వరం గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. పేకాటరాయుళ్లు కరోనాకు అడ్డంగా బుక్కవ్వడంతో వారి కుటుంబీకులు సైతం తమకెక్కడ కరోనా అంటుకుంటుందో అని భయపడిపోతున్నారు.
ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ డైట్.. దీని ప్రత్యేకత ఏంటంటే..?!
ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకుంటారు..!
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్‌క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..