(Teenagers Vaccination) న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 15–18 ఏళ్ల మధ్య వయస్కులకు తొలి డోస్ వ్యాక్సిన్ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 12,89,501 మంది పిల్లలకు టీకాలు వేయగా.. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 52.82 శాతం టీకాలు వేసే లక్ష్యాన్ని పూర్తి చేసింది. నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే అత్యధికంగా 76.09 శాతం వ్యాక్సినేషన్ చేపట్టిన జిల్లాగా తొలి స్థానంలో నిలిచింది. ఏపీ తర్వాత హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు నిలిచాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో 49.2 శాతం, గుజరాత్లో 45.29 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌లో 33.44 శాతం, రాజస్థాన్‌లో 22 శాతం నమోదయ్యాయి. 15-18 సంవత్సరాల వయస్సు వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడం మన దేశంలో ఈ నెల 3 న ప్రారంభమైంది. ఇప్పటివరకు 85 లక్షల మంది మొదటి డోస్‌ను స్వీకరించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24.41 లక్షల మంది యువకులను గుర్తించి.. 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో కోవాక్సిన్ వ్యాక్సిన్‌ను అందజేస్తున్నారు. ఇవాల్టి నుంచి గ్రామ, వార్డు సచివాలయాలతోపాటు విద్యాసంస్థల్లో కూడా ఆరోగ్య సిబ్బంది టీకాలు వేయనున్నారు. శనివారం నాటికల్లా టీనేజర్లందరికీ టీకాలు వేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటున్న వారు తమ పేర్లను సెల్ఫ్ ఎన్రోల్ చేసుకోవచ్చు. కొవిన్‌లో ఈ సదుపాయం అందుబాటులో ఉన్నది. లబ్ధిదారులు వెరిఫైయర్/వ్యాక్సినేటర్ ద్వారా కూడా ఆన్సైట్లో నమోదు చేసుకోవచ్చు. అపాయింట్మెంట్లను ఆన్లైన్ లేదా ఆన్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
రిలాక్స్ కోసం కాఫీ తాగుతున్నారా? ఒక్క క్షణం ఆలోచించండి
ప్రతినెలా రూ.1500 పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ. 35 లక్షలు…
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
మీ జీవితభాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..