విజయవాడ : (Sajjala on PRC) ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శుభావార్త తెలిపారు. పీఆర్సీపై కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీపై కసరత్తు ముమ్మరంగా జరుగుతున్నదని తెలిపారు. త్వరలోనే ఉద్యోగులు ఈ వార్త అందుకుంటారని వెల్లడించారు. దీనిపై సీఎం జగన్ మోహన్ రెడ్డితో చర్చిస్తున్నట్లు సజ్జల తెలిపారు.
అంతేకాకుండా ఇప్పటికే పీఆర్సీపైన ప్రకటన చేయాలనుకున్నామని, అయితే, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయినట్లు చెప్పారు. త్వరలోనే పీఆర్సీపై గుడ్న్యూస్ ఉద్యోగులు వింటారన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెలలో నిర్వహిస్తున్న నేపథ్యంలో సజ్జల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? న్యుమోనియా కావచ్చు !
చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తుంది.. హార్ట్ స్ట్రోక్ రావడానికి ముందు ఏమవుతుంది?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..