మాగనూర్ వాగులో ఇసుక టిప్పర్ల అడ్డగింత
‘మాగనూర్ పెద్దవాగును రాఘవ కన్స్ట్రక్షన్స్ గుల్ల చేస్తున్నది. మంత్రి బంధువుల కంపెనీ కావడంతో ప్రభుత్వ అండతో యథేచ్ఛగా వాగును తోడేస్తున్నారు’ అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నారాయణపేట జిల్లా మాగనూర్ మండల కేంద్రానికి సమీపంలోని పెద్దవాగు నుంచి నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పనులకు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపుపై ధ్వజమెత్తారు.
- మంత్రి బంధువుల కంపెనీకి రేవంత్ ప్రభుత్వం అండ
- పెద్దవాగును గుల్ల చేస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ
- ఇసుక అక్రమ తరలింపుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం ఆగ్రహం
మాగనూర్, జూన్ 22 : ‘మాగనూర్ పెద్దవాగును రాఘవ కన్స్ట్రక్షన్స్ గుల్ల చేస్తున్నది. మంత్రి బంధువుల కంపెనీ కావడంతో ప్రభుత్వ అండతో యథేచ్ఛగా వాగును తోడేస్తున్నారు’ అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నారాయణపేట జిల్లా మాగనూర్ మండల కేంద్రానికి సమీపంలోని పెద్దవాగు నుంచి నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పనులకు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపుపై ధ్వజమెత్తారు. సోమవారం పెద్దవాగు వద్దకు వెళ్లిన ఆయన ఇసుక తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి బంధువులకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నదని ఆరోపించారు. మరోవైపు మంత్రి వాకిటి శ్రీహరి అండదండలతో కృష్ణానది పరీవాహక ప్రాంతం నుంచి రాత్రింబవళ్లు ఇసుక తరలిస్తూ కొందరు నేతలు అక్రమ సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
పలుమార్లు ఇసుక తరలింపుపై స్థానికులు అభ్యంతరం వ్యక్తంచేసినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దీంతో తానే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చిందని తెలిపారు. ఇసుక దందాకు అధికారులు, పోలీసులు సహకారం అందిస్తున్నారని మండిపడ్డారు. కృష్ణ మండలంలో ఇసుక అక్రమంగా తరలిపోతున్నదని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తూ ‘అడ్డొస్తే అంతు చూస్తాం’ అంటూ మాఫియా బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నారాయణపేట కలెక్టర్ సీహెచ్ ప్రియాంకను కలిసి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. నదీ తీరప్రాంతంలో అనుమతులు లేకుండా.. మాగనూరు మండలం ఉజ్జల్లికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి ఇసుక తరలిస్తుండటంతో బీఆర్ఎస్ నేత శివరాజ్‌పాటిల్ అడ్డుకునేందుకు యత్నంచేశాడని తెలిపారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతకు ఈ నెల 18న రాత్రి శ్రీనివాస్‌రెడ్డి బంధువులు సురేశ్‌రెడ్డి, ఈశప్ప, భీమన్న ఫోన్‌చేసి బెదిరింపులకు పాల్పడ్డారని, వీరిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Ranabaali | ‘రణబాలి’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఎంత .. విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా పెరగాల్సిందే!
Manthani | మంథనిలో అక్రమంగా తరలిస్తున్న 11 ఆవులు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

