Gudlavalleru Engineering College | కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలు ఉన్నాయని విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రికత్తకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. హాస్టల్లో రహస్య కెమెరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరపాలని ఆదేశించారు. తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనాస్థలికి వెళ్లాలని ఆదేశించారు. ఈ క్రమంలో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి విద్యార్థుల స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఓ యవతి సహకారంతో వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టారని విద్యార్థులు వివరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గంగాధర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ కాలేజీలో ఘటన దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. అనుమానితుడి నుంచి ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నేరానికి పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కఠిన చర్యలు తప్పవు : హోంమంత్రి అనిత
గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై హోంమంత్రి అనిత తీవ్రంగా స్పందించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వేధింపులు లేకుండా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి : నారా లోకేశ్
ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినుల ఆందోళనపై ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాలేజీల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తచర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. కాలేజీలో ర్యాగింగ్, వేధింపులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు.
Read More :