విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ(Gudlavalleru Engineering College) మహిళల హాస్టల్(Womens Hostel) వాష్‌రూమ్‌లో ఓ వ్యక్తి సీక్రెట్ కెమరా అమర్చాడు. ఆ కెమెరాకు చెందిన 300 ఫోటోలు, వీడియోలు లీకయ్యాయి. రికార్డు చేసిన ఆ వీయోలను కొందరు విద్యార్థులకు అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన ఘటన పట్ల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. స్థానిక ప్రజలు కూడా ఆ ఆందోళనలో పాల్గొన్నారు.
గురువారం సాయంత్రం ఆ సీక్రెట్ కెమెరాలను కొందరు మహిళలు గుర్తించారు. అయితే వెంటనే ఈ విషయాన్ని ఆ అమ్మాయిలు అలర్ట్ చేశారు. రాత్రి ఏడు గంటల నుంచి ఇవాళ ఉదయం వరకు విద్యార్థినలు కాలేజీ ఆవరణలో నిరసన చేపట్టారు. న్యాయం కావాలి అంటూ నినాదాలు చేశారు.
శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనలో 300 పైగా బాత్రూం వీడియోలు తీయించిన విజయ్ అనే నిందితుడు
కెమెరాలు పెట్టి వీడియోలు తీయడంలో విజయ్ ప్రియురాలు అతనికి సహకరించింది అని ఆరోపిస్తున్న విద్యార్థినులు. https://t.co/27hXwjml6E pic.twitter.com/Gi3Zy6Kc4q
— Telugu Scribe (@TeluguScribe) August 30, 2024
రహస్య కెమెరా అమర్చిన ఘటనలో.. సీనియర్ విద్యార్థి విజయ్ కుమార్‌ను అరెస్టు చేశారు. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అతను బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు. అతని ల్యాప్‌టాప్‌ను సీజ్ చేశారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. వుమెన్స్ హాస్టల్ వాష్‌రూమ్ నుంచి 300 ఫోటోలు, వీడియోలు లీకైనట్లు తెలుస్తోంది. విజయ్ నుంచి కొంత మంది విద్యార్థులు ఆ వీడియోలను కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు. వీడియోలు లీక్ కావడం పట్ల విద్యార్థినులు తీవ్ర షాక్ వ్యక్తం చేశారు. కెమెరాలను ఎవరు అమర్చారు, వీడియోలను ఎవరు షేర్ చేశారన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
గుడివాడ లోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ లోని అమ్మాయిల హాస్టల్ బాత్రూం లో స్పై కెమెరా లు అమర్చి – వాళ్ల వీడియో లు చిత్రీకరించి – వాటిని బాయ్స్ హాస్టల్ వాళ్లకి అమ్మి డబ్బులు తీసుకుంటున్నారు – ఇప్పటికి 300 వీడియో లు అమ్మినట్టు సమాచారం
ఈ మొత్తం ప్రక్రియ ని నాల్గవ సంవంత్సరం… https://t.co/WPuHnUa0Vh pic.twitter.com/xhIuXZQnlh
— 𝐀𝗋α𝗏𝗂𐓣ᑯα𝐒αꭑ𝖾𝗍α🚩 (@HarieswarH) August 30, 2024