AP News | కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమేరాలు ఉన్నాయనే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విచారణకు ఆదేశించారు. హాస్టల్ లో రహస్య కెమేరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరపాలని సిఎం ఆదేశించారు. తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ లను ఘటనా స్థలానికి వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
కృష్ణా జిల్లా గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోని లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయనే వ్యవహారం ఇప్పుడు ఉద్రిక్తంగా మారింది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదివే ఓ విద్యార్థి దాదాపు 300 అమ్మాయిల వీడియోలను తీసి.. వాటిని బాయ్స్ హాస్టల్లో విక్రయించినట్లుగా తెలియడంతో గురువారం రాత్రి విద్యార్థులు ఆందోళన చేశారు. అయితే పోలీసుల జోక్యంతో రాత్రి విద్యార్థులు ఆందోళన విరమించారు. కానీ ఇవాళ ఉదయం జిల్లా ఎస్పీ చేసిన ఒక ప్రకటన తీవ్ర దుమారం రేపింది. ఈ ప్రకటనపై అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వారం రోజుల నుంచి చెప్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా,నిన్న వచ్చి ఫేక్ న్యూస్ అంటున్నారు , మాకు న్యాయం జరగాలి .#AndhraPradesh #JusticeForWomen #GudlavaleruCollegeIncident pic.twitter.com/gUq6x9kb4M
— Pura Local (@PuraLocal) August 30, 2024
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో గురువారం జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారని ఎస్పీ తెలిపారు. బాలికల హాస్టల్లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించబడలేదని పేర్కొన్నారు. విద్యార్థులు, కాలేజీ స్టాఫ్ ఎదురుగానే పోలీసులు నిందితుల ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పరిశీలించారని చెప్పారు. అందులో నేరారోపణ చేసే ఏ విధమైన అంశాలు కనుగొనబడలేదని అన్నారు. అమ్మాయిలు ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తదుపరి విచారణ పురోగతిలో ఉందని అన్నారు. ఈ నేరంలో తప్పు చేసిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కృష్ణా జిల్లా ఎస్పీ ప్రకటనపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేయకుండానే ఇది ఫేక్ న్యూస్ అని ఎలా బుకాయిస్తారని మండిపడ్డారు. ఈ వీడియోలపై నిన్న సాయంత్రం ఫిర్యాదు చేస్తే విచారణకు 30 రోజుల గడువు కోరారని.. పొద్దునకల్లా అది ఫేక్ న్యూస్ ఎలా అయ్యిందని ప్రశ్నించారు. దీనిపై ప్రశ్నించినందుకు తమపైనే రివర్స్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులందరూ కలిసి కాలేజీ ముందు ధర్నాకు దిగారు. వీరికి మద్దతుగా విద్యార్థి సంఘాలు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నాయి. దీంతో కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సెలవు ఇచ్చిన యాజమాన్యం https://t.co/D9kxg16YXy pic.twitter.com/r8XIRPLRth
— Telugu Scribe (@TeluguScribe) August 30, 2024