అమరావతి : ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు (Polavaram) నిర్మాణ బాధ్యతలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ కేబినెట్ (AP Cabinet ) అభినందిస్తూ తీర్మానించింది. ప్రాజెక్టుకు కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ తెలిపింది. గురువారం సాయంత్రంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో అమరావతి అభివృద్ధికి, ఇతర పథకాలకు బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వటంపై కూడా అభినందిస్తూ తీర్మానం చేశారు. కేంద్ర నిధుల విషయంలోనూ సమన్వయం చేసుకోవాలని కోరారు. పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణంపై చర్చ జరిగింది.
డయాఫ్రం వాల్‌పై టెక్నికల్ కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ ఆమోదించింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుండా నిర్మించాలని , గతంలో నిర్దేశించిన ఎత్తుకే కట్టుబడి ఉండేలా చూడాలని తీర్మానించింది. వైసీపీ చేస్తున్న రాజకీయ విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలని , ఎక్కడా వెనక్కి తగ్గొద్దని మంత్రులకు చంద్రబాబు సూచించారు.
YCP MP Mithun Reddy | తప్పుడు ఆరోపణలు చేస్తే.. పరువు నష్టం దావా వేస్తా : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
Vangalapudi Anitha | అసెంబ్లీకి వచ్చి వాళ్ల పేర్లు చెప్పే దమ్ముందా? జగన్‌ను హోంమంత్రి అనిత సవాలు