Vangalapudi Anitha | అసెంబ్లీకి వచ్చి వాళ్ల పేర్లు చెప్పే దమ్ముందా? జగన్‌ను హోంమంత్రి అనిత సవాలు
Vangalapudi Anitha | ఏపీలో ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. నిజానికి తమ పార్టీ కార్యకర్తలపైనే దాడులు చేస్తూ ఢిల్లీకి వెళ్లి దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు.
Vangalapudi Anitha | ఏపీలో ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. నిజానికి తమ పార్టీ కార్యకర్తలపైనే దాడులు చేస్తూ ఢిల్లీకి వెళ్లి దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం నిర్వహించిన ప్రశ్నోత్తరాల సమయంలో వంగలపూడి అనిత మాట్లాడారు. వైసీపీ సానుభూతిపరులపై దాడులు జరుగుతున్న విషయం వాస్తవమేనా? అని ప్రశ్న వేసి వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాలేదని ఎద్దేవా చేశారు.
ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు రాజకీయ హత్యలు జరిగాయని.. అందులో ముగ్గురు టీడీపీకి చెందినవారే ఉన్నారని వంగలపూడి అనిత స్పష్టం చేశారు. వాటికి సంబంధించి కేసు నంబర్లతో సహా వెల్లడించామని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 36 రాజకీయ హత్యలు జరిగాయని వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారని.. ఆ పేర్లు అడిగితే మాత్రం మాట్లాడటం లేదని విమర్శించారు. అసెంబ్లీకి వచ్చి ఆ 36 మంది పేర్లు చెప్పే దమ్ము జగన్‌కు లేదా అని ప్రశ్నించారు. చనిపోయిన వాళ్ల పేర్లు చెప్పకుండా ఢిల్లీ ఎందుకు వెళ్లారని ఆమె నిలదీశారు.
జగన్ ఆరోపిస్తున్నట్లు టీడీపీ దాడుల్లో చనిపోయిన 36 మంది వివరాలతో సభకు రావాలని హోంమంత్రి వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. ఆ వివరాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఆ వివరాలు తప్పు అని తేలితే ప్రభుత్వం తీసుకునే చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. నారా లోకేశ్ రెడ్‌బుక్ గురించి వైసీపీ కార్యకర్తలే పట్టించుకోవడం లేదని.. మరి జగన్‌కు ఎందుకు నిద్ర పట్టడం లేదో అని ఎద్దేవా చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

