విజయవాడ : (AP Wines rates) రాష్ట్రంలో మద్యంపై పన్ను రేట్లను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విలువ ఆధారిత పన్ను (వ్యాట్) లో ఏపీ ఎక్సైజ్ శాఖ మార్పులు చేసింది. మద్యం మూల ధరపై మొదటి విక్రయం జరిగే చోట పన్ను ధరల సవరణ చేశారు.
దేశంలో తయారైన విదేశీ బ్రాండ్లపై ధర ఆధారంగా పన్నుల్లో మార్పులు చేశారు. రూ.400 ధర లోపు ఉన్న బ్రాండ్లకు 50 శాతం మేర వ్యాట్ వర్తింపజేయగా.. రూ.400-రూ. 2500 మధ్య ఉండే మద్యం కేసుకు సంబంధించి 60 శాతం వ్యాట్ వసూలు చేయనున్నారు. ఇక రూ.2500-రూ.3500 మధ్య మద్యం కేసుపై 55 శాతం మేర వ్యాట్ వసూలు చేస్తారు. రూ.3500-రూ. 5000 వరకూ ధర ఉన్న మద్యం కేసుపై 50 శాతం మేర వ్యాట్ వడ్డించనున్నారు.
దేశీయ తయారీ బీర్ కేసుపై రూ.200 కంటే తక్కువున్న వాటిపై 50 శాతం, రూ.200 కంటే ఎక్కువ ధర ఉన్న బీర్ కేసుపై 60 శాతం వ్యాట్ విధించనున్నారు. ఇక అన్ని రకాల మద్యంపై 35 శాతం వ్యాట్ వసూలు చేయాలని ఏపీ ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. రెడీ టు డ్రింక్లపై 50 శాతం వ్యాట్ విధిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? న్యుమోనియా కావచ్చు !
చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తుంది.. హార్ట్ స్ట్రోక్ రావడానికి ముందు ఏమవుతుంది?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..