(pigeon with tag) ప్రకాశం: చైనా అక్షరాల ట్యాగ్‌తో ఓ పావురం ప్రత్యక్షమై కలవరానికి గురిచేసింది. కాలికి రబ్బర్ ట్యాగ్‌తో వచ్చిన పావురాన్ని చీమకుర్తి వాసి గుర్తించి పట్టుకోవడం జిల్లాలో కలకలం రేపింది. చైనా గూఢచారి పావురమే అయి ఉంటుందని స్థానికులు చర్చించుకుంటుండగా.. ఈ విషయాన్ని తేల్చేందుకు జిల్లా పోలీసులు విచారిస్తున్నారు.
చీమకుర్తి మండలం నెహ్రూనగర్‌లో నాగరాజు అనే యువకుడు నివసిస్తున్నాడు. ఈయన ఇంటికి తరచుగా పావురాలు వస్తుంటాయి. ఈ క్రమంలో స్థానిక అపార్ట్మెంట్లో పావురం కాలుకు రబ్బర్ ట్యాగ్ వేసి ఉండటం గుర్తించాడు. ఆ పావురాన్ని పట్టుకుని చూడగా.. ట్యాగ్‌పై 2019, 2207 నంబర్లతో చైనీస్ అక్షరాలు ఉన్నాయి. ఈ విషయాన్ని నాగరాజ్ వెంటనే వీఆర్వోకు, పోలీసులకు తెలిపాడు. వీఆర్వో ఘటనా స్థలానికి చేరుకుని పావురాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
గతంలో ఒడిశాలో కూడా ఇలాంటివి జరిగాయి. కేంద్రపాడ జిల్లా మార్ సగై పీఎస్ పరిధిలోని పూరీ జిల్లాలోని దశరథ్‌పూర్, హరికృష్ణాపూర్లో వీహెచ్ఎఫ్ వైజాగ్ 19742021 అని ముద్రించిన ట్యాగ్‌ను కలిగిఉన్న పావురాలను పట్టుకున్నారు. గత సోమవారం పూరీ జిల్లాలో ఒక పావురం కూడా ఇదే మాదిరి ట్యాగ్‌తో గుర్తించారు. ఈ ట్యాగ్‌పై కూడా చైనా భాషలో అల్యూమినియం, 37 అంకె రాసి ఉన్నది.
చాతిలో నొప్పి వస్తే అది గ్యాస్ట్రిక్ సమస్యా? గుండెనొప్పా?
కళ్లు పొడిబారుతున్నాయా..? తస్మాత్ జాగ్రత్త!
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
మీ జీవితభాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
చర్మంపై దద్దుర్లు, దురద ఉంటే.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..