Bird Flu | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ (Bird Flu) కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఉభయగోదావరి జిల్లాల పరిధిలో లక్షలాది కోళ్లు మృతి చెందుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ మనిషికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకడం ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలానికి చెందిన వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆ వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని వైద్యారోగ్య శాఖ అధికారులు ధృవీకరించాల్సి ఉంది.
కాగా, రెండు గోదావరి జిల్లాల పరిధిలో గత కొంత కాలంగా లక్షలాది కోళ్లు మృత్యువాతపడుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమైన మృతి చెందిన కోళ్ల శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపగా బర్డ్‌ఫ్లూగా తేలింది. తూర్పు గోదావరి జిల్లా కానూరు అగ్రహారం, వేల్పూరులోనూ ఓ కోళ్లను నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపగా.. బర్డ్‌ఫ్లూగా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో అధికారులు అగ్రహారం పరిధిలోని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. మరో వైపు బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయ్యిన ప్రాంతంలో చికెన్ దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
Also Read..
Bird Flu | ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం..! చికెన్ తినొద్దంటూ ఇంటింటా ప్రచారం..!
Vallabhaneni Vamsi | వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు.. రాయదుర్గం పోలీసుల సహకారంతో అదుపులోకి!
Jamili Elections | 2027లో జమిలి ఎన్నికలు : చింతా మోహన్