Jamili Elections | హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : 2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వెల్లడించారు. ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ వచ్చి కాసేపు అటూ ఇటూ తిరిగితే రాజకీయ రహస్యం తెలిసిపోయిందని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఉత్తుత్తి మాటలు ఆపి విశాఖ ఉకు ఫ్యాక్టరీకి గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల్లో ఉన్న లక్షల కోట్ల దేశ సంపదనంతా గుజరాతీలకు, మార్వాడీలకు రుణాలుగా ఇస్తున్నాయని మండిపడ్డారు.