Bird Flu | ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం..! చికెన్ తినొద్దంటూ ఇంటింటా ప్రచారం..!
Bird Flu | తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే ఈ రెండు జిల్లాల పరిధిలో వరుసగా కోళ్లు పెద్ద సంఖ్యలో మృతి చెందుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమైన మృతి చెందిన కోళ్ల శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపగా బర్డ్‌ఫ్లూగా తేలింది.
Bird Flu | తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే ఈ రెండు జిల్లాల పరిధిలో వరుసగా కోళ్లు పెద్ద సంఖ్యలో మృతి చెందుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమైన మృతి చెందిన కోళ్ల శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపగా బర్డ్‌ఫ్లూగా తేలింది. తూర్పు గోదావరి జిల్లా కానూరు అగ్రహారం, వేల్పూరులోనూ ఓ కోళ్లను నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపగా.. బర్డ్‌ఫ్లూగా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో అధికారులు అగ్రహారం పరిధిలోని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. మరో వైపు బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయ్యిన ప్రాంతంలో చికెన్ దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
గ్రామానికి పది కిలోమీటర్ల పరిధిలో సర్వేలెన్స్ జోన్‌గా నిర్ణయించారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఫౌల్ట్రీలు ఉండడంతో పాటుగా కోళ్లు మృతి చెందడంతో ఆ పరిధిలో రెడ్‌జోన్‌గా ప్రకటించి.. పది కిలోమీటర్ల పరిధిలో సర్వేలెన్స్ జోన్లుగా గుర్తించాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. అధికారులతో సమావేశం నిర్వహించి ఈ వైరస్‌ను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో జనం కొద్దిరోజులు చికెన్ తినడం మానుకోవడం మంచిదని కలెక్టర్ సూచించారు. బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరాను వారం పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కానూరు అగ్రహారం మినహా మరెక్కడా బర్డ్‌ఫ్లూ ప్రభావం లేదని.. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ సూచించారు.
అయితే, బర్డ్‌ఫ్లూ వలస పక్షుల కారణంగా సోకి ఉండవచ్చని పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ దామోదర నాయుడు పేర్కొన్నారు. వలస పక్షుల్లో ఉండే వైరస్ వాటి రెట్టల ద్వారా జలాశయాల్లోకి చేరుతోందని.. అక్కడి నుంచి నీరు, ఇతర మార్గాల ద్వారా కోళ్లకు సంక్రమిస్తూ ఉండవచ్చన్నారు. బర్డ్‌ఫ్లూ సాధారణంగా ఎక్కడో ఒక చోట వస్తూనే ఉంటుందని.. కేంద్రం ఆదేశాల మేరకు అన్ని నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. వైరస్ కారణంగా నష్టపోయిన ఫౌల్ట్రీ రైతులకు పరిహారం అందజేస్తామన్నారు. మరో మిర్తిపాడులో బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టించింది. ఒకే రోజు ఎనిమిది వేలకుపైగా కోళ్లు మృతి చెందాయి. దాంతో రెండు కిలోమీటర్ల పరిధిలో బఫర్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. మరో వైపు అధికారులు బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో చికెన్ తినొద్దని ఇంటింటా ప్రచారం చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

