గుంటూరు : (Cheating) లోన్ త్వరలోనే అందుతుందని నమ్మిస్తూ పెద్ద మొత్తంలో మోసానికి పాల్పడిన ఓ నకిలీ డాక్టర్ వ్యవహారం గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. ఫిజియోథెరపీ చేస్తూ కుటుంబానికి దగ్గరైన ఈ కిలాడీ యువతి.. దాదాపు రూ.60 లక్షలకు పైగా మోసం చేసినట్లు తెలుస్తున్నది.
తాడేపల్లి ఇప్పటంకు చెందిన మిలటరీ ఉద్యోగి కార్తీక్ భార్యకు ఆరోగ్య కారణాలతో ఫిజియోథెరపీ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో డాక్టర్ పేరుతో పరిచయమైన రోజా అనే మహిళ కార్తీక్ భార్యకు కొంతకాలంగా వైద్య సేవలు అందిస్తూ కార్తీక్ కుటుంబానికి దగ్గరైంది. ఈ చనువును ఆసరాగా చేసుకుని ఫిజియోథెరపిస్ట్ రోజా.. దవాఖాన ఏర్పాటు చేస్తున్నానని, కోటిన్నర లోన్ వస్తుందని వారిని నమ్మింది. ఆ యువతి మాటలు నమ్మిన కార్తిక్ కుటుంబం దాదాపు రూ.60 లక్షల వరకు నగదు, రూ.10 లక్షల విలువ చేసే బంగారం, సొంతింటి కాగితాలు తాకట్టు పెట్టి ఆదుకున్నారు. కొద్ది రోజులకు తాను అలాంటి మాటలేం చెప్పలేదని, తాను అంత మొత్తం ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పింది. అంతటితో ఆగకుండా పెదకాకానిలో పనిచేస్తున్న ఓ ఎస్ఐని పెండ్లి చేసుకుని అతని అండతో బెదిరింపులకు దిగింది. దాంతో బాధిత కుటుంబం రోడ్డున పడింది. దాంతో బాధితులు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఎస్ఐ తన కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని, ఆయన బారి నుంచి రక్షణ కల్పించాలని రిటైర్డ్ మిలటరీ ఉద్యోగి కార్తీక్ అధికారులకు విజ్ఞప్తిచేస్తున్నారు.
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? న్యుమోనియా కావచ్చు !
చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తుంది.. హార్ట్ స్ట్రోక్ రావడానికి ముందు ఏమవుతుంది?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..