కాంగ్రెస్ పార్టీలో టికెట్ల గడబిడ మొదలైంది. నాకే టికెట్ ఇవ్వాలని ఒక వర్గం, ఎదుటి వర్గానికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని మరోవర్గం.. ఇలా పంచాయితీకి దిగుతున్నాయి. ఏకంగా హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఎదుట ధర్నాలకు దిగాయి. ఆదిలాబాద్ కాంగ్రెస్ టికెట్ కంది శ్రీనివాస్ రెడ్డికి ఇస్తే మేం మద్దతు తెలుపమని ప్రత్యర్థి వర్గం ఆందోళనలు నిర్వహించాయి. ఆసిఫాబాద్ టికెట్ శ్యాంనాయక్‌కు ఇస్తే సహకరించమని ఎదుటి వర్గం ఇలా ఆందోళనకు దిగాయి. మిగతా నియోజకవర్గాల్లో కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం వర్గపోరుతో కొట్టుమిట్టాడుతోంది. ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో ఎవరికీ సహకరించాలో తెలియక ద్వితీయ శ్రేణి కార్యకర్తలు, నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఒకరికి సహకరిస్తే.. మరొకరి నుంచి ఇబ్బందులు తప్పవని అయోమయంలో ఉన్నారు.
మంచిర్యాల, అక్టోబర్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరికి టికెట్ ఇస్తారు..? ముందు నుంచి పని చేసిన నన్ను కాదని, ఈ మధ్య వచ్చిన వారికి ఇవ్వడానికి వీల్లేదు. నా కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా సపోర్ట్ చేసేదే లేదు. నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు, పక్కనోడికి కూడా ఇవ్వొద్దు. నిన్న, మొన్నటి దాకా టికెట్ నాకంటే నాకు వస్తోందని గప్పాలు కొట్టుకొని తిరిగిన కాంగ్రెస్ నాయకుల ప్రస్తుత పరిస్థితి ఇది. మరో 50 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగియను న్నా.. ఇప్పటికీ ఎవరికి టికెట్ ఇస్తారో తెలియని పరిస్థితి. కలిసికట్టుగా ఉండి పార్టీ కోసం పని చేయాల్సిన కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ము దురుతున్నాయి. మా నియోజకవర్గంలో ఫలానా వ్య క్తికి టికెట్ ఇవ్వొద్దంటూ హైదరాబాద్‌కు పోయి ఏకం గా గాంధీభవన్ ముందే ధర్నాలకు దిగుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆ పార్టీ నాయకుల మధ్య వర్గ పోరు తీవ్రమైంది. మొన్నటికి మొన్న ఆదిలాబాద్ నియోజకవర్గ టికెట్ కంది శ్రీనివాస్‌రెడ్డికి ఇవ్వొద్దంటూ ప్రత్యర్థి వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు గాంధీ భవన్ ఎదుట నిరసనకు దిగారు. అది మరవక ముందే బుధవారం ఆసిఫాబాద్ నియోజకవర్గంలో శ్యాం నాయక్‌కు టికెట్ ఇవ్వొద్దంటూ ప్రత్యర్థి వర్గం ధర్నాకు దిగింది. ఈ రెండు నియోజకవర్గాల్లోనే కాదు దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక కిందిస్థాయి కార్యకర్తలు, నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరికి వారే.. టికెట్ తమకే వస్తోందంటే తమకే వస్తోందని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ రోజు ఒక నాయకుడు పర్యటించిన దగ్గరకు తెల్లారి మరో నాయకుడు అదే పార్టీ కం డువా వేసుకొని వెళ్తున్నాడు. కాంగ్రెస్ కొంత బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ లీడర్ల మధ్య ఉన్న గొడవలే కింది స్థాయి నాయకుల్లోనూ ఉంటున్నాయి. మంచిర్యాల జిల్లాలో సీనియర్ నేత ప్రస్తుత మంచిర్యాల నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న నేతపై బెల్లంపల్లి నుంచి పోటీలో ఉన్న మరో సీనియర్ లీడర్ చెక్ బౌ న్స్ కేసు వేశారు. అంతకు ముందు సదరు మంచిర్యా ల నేత బెల్లంపల్లి, చెన్నూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ నియోజకవర్గాల్లోనూ తాను చెప్పిన వారికే టికె ట్లు అంటూ ప్రత్యేక వర్గాన్ని ప్రోత్సహించారు. అధిష్టానం నుంచి ఓ పోస్టు వచ్చాక తాను ప్రోత్సహించిన వర్గాలను ఆయనే దూరం పెడుతున్నారు. దీంతో ఆ యా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా మారింది. పట్టించుకునే నాథుడు లేక ఎవరికి టికెట్ ఇస్తారో తెలియక.. బీఆర్ఎస్ పార్టీ దూకుడును తట్టుకోలేక కాంగ్రెస్ లీడర్లు గడప దాటి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. మంచిర్యాల టికెట్ ఆ సీనియర్‌కి ఇస్తే బీసీలకు టికెట్ ఇస్తారనో ఆశతో ఆ పా ర్టీలో చేరిన ఓ బీసీ నాయకుడు(ఈయనో డాక్టర్) స హా ముందు నుంచి పార్టీనే పట్టువదలని ‘ప్రతాప’రుద్రుడిలా పట్టుకొని ఉన్న మరో సీనియర్ ఆయనకు సహకరించే పరిస్థితి లేదు. చెన్నూర్ నియోజకవర్గంలో ఇటీవలే బీఆర్ఎస్ నుంచి రెండోసారి కాంగ్రెస్‌లోకి వచ్చిన నేతకు టికెట్ ఇస్తారనే ప్రచారం ఊపందుకోడంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి టికెట్ వస్తోందని చెప్పుకు తిరిగిన ఓ డాక్టర్ సహా మంచిర్యాల సీనియర్ లీడర్ వర్గం, మరో మహిళ లీడర్ కినుక వహిస్తున్నారు. ముందు నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న తమను కాదని ఆయనకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని, అవసరమైతే ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తామని సన్నిహితులో చెబుతున్నారు. బెల్లంపల్లి, కాగజ్‌నగర్, బోథ్, ఖానాపూర్ నియోజకవర్గా ల్లో ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందంటూ ప్రచారాలు చేసుకుంటున్నారు. ఎవరికి టికెట్ ఇచ్చిన మిగిలిన వారు సహకరిస్తారా లేదా అన్నది సందేహంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా లీడర్లను న మ్ముకొని పని చేసి కింది స్థాయి నాయకులు ఏం చే యాలో అయోమయంలో పడిపోతున్నారు.
కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో టికెట్లు కన్ఫమ్ చేశాక.. అసలు కొట్లాట మొదలు కానుంది. టికెట్ ఆశిస్తున్న వారిలో ఏ ఒక్కరు కూడా పార్టీకి పని చేయకపోవచ్చు. స్వతంత్రంగా పోటీ చేయడమా లే దా అధికార పార్టీలోనే, ఇతర పార్టీలోనే చేరటమా ప క్కగా జరుగుతుంది. ఇప్పటికే కొందరు నాయకులు ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏ దో ఒక గుర్తు కోసం తహతహలాడుతున్నారు. ఇ లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం ఎదురుకానుంది. కష్టపడి టికెట్ తెచ్చుకున్న సొంత పార్టీ నాయకుల సపోర్ట్ లేకుండా పని చేయడం చాలా క ష్టం కానుంది. బలంగా ఉన్న ఒకటి, రెండు నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీపై ఈ టికెట్ల పంచాయతీ, అసంతృప్తి, అసమ్మతి తీవ్రమైన ప్రభావం చూపనుంది.