హాజీపూర్, జనవరి 21 : ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోనున్నట్లు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మండలంలోని ర్యాలీ, గఢ్‌పూర్, నాగారం, చిన్నగోపాల్పూర్, పెద్దంపేట, దొనబండ గ్రామాల్లో మంగళవారం గ్రా మసభలు నిర్వహించారు. పెద్దంపేటలో గ్రా మసభకు కలెక్టర్ కుమార్ దీపక్ హాజరయ్యా రు. పెద్దంపేటలో డీఆర్డీవో కిషన్, తహసీల్దార్ శ్రీనివాస్ రావ్ దేశ్ పాండేతో కలిసి పాల్గొన్నా రు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాల పరిశీలన అనంతరం, అర్హుల జాబితాలో ప్రభుత్వ ని బంధనల మేరకు ప్రాధాన్యతా క్రమంలో నిరుపేదలకు ఫలాలు అందించడం జరుగుతుందని తెలిపారు. జాబితాలో వివరాలు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చునని, రేషన్ కార్డుల జారీలో నిబంధనలు పాటిస్తూ అర్హుల వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని తెలపారు. రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. 24వ తేదీ వరకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో సభలు నిర్వహించి, అర్హుల జాబితా చదివి వినిపించిన అనంతరం జాబితాలో లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.
శ్రీరాంపూర్, జనవరి 21 : నస్పూర్ ము న్సిపాలిటీ పరిదిధిలోని పలు వార్డుల్లో సమావేశాలు నిర్వహించారు. 5వ వార్డు అరునక్కనగర్లో వార్డు కమిటీ సమావేశంలో కలెక్టర్ పాల్గొని పథకాలు వివరించారు. ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డుల దరఖాస్తులు, పి ల్లల పేర్లు నమోదు, రైతు భరోసా లబ్ధిదారుల ఎంపికపై చర్చించనున్నటుల పేర్కొన్నారు. అర్హులందరికీ పథకాలు ఆందించడం జరుగుతుందన్నారు. అలాగే 6వ వార్డుకు సంబంధించి ఆర్కే8 కాలనీలో, 8వ వార్డు సమావేశం తాళ్లపల్లి గ్రామంలో కమిషనర్ చిట్యాల సతీశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చీడం మహేశ్, కౌన్సిలర్లు పూదరి కుమార్, బండారి సంధ్యారాణిసుధాకర్, మున్సిపల్ చైర్మన్ సుర్మిల్ల వేణు, వైస్ చైర్మన్ గెల్లు రజితామల్లేశం, డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, మున్సిపల్ మేనేజర్ కరుణాకర్ పాల్గొన్నారు.
బెల్లంపల్లి, జనవరి 21 : బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి 11వ వార్డులో నిర్వహించిన వార్డు సభకు ఆర్డీవో హరికృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ శ్వేత, కమిషనర్ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ హాజరయ్యారు. ఒకటో వార్డు కన్నాల బస్తీలో ఆర్డీవో హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన వార్డు సభలో అనర్హులకు పథకాలు అమలు చేస్తున్నారని బస్తీవాసులు నిరసన వ్యక్తం చేశారు.
ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జనవరి 21 : ఆసిఫాబాద్ మండలం బాబాపూర్‌లో నిర్వహించిన గ్రామసభలో కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, డీఆర్డీవో దత్తారాం హాజరయ్యారు. అర్హుల జాబితాను గ్రామసభలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి చదివి వినిపిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్ రూరల్, జనవరి 21 : కాగజ్‌నగర్ మండలం ఎన్జీవోస్ కాలనీ గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభకు మండల ప్రత్యేకాధికారి, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా హాజరయ్యారు. పథకాలు నిరంతర ప్రక్రియ అన్నారు.
వాంకిడి, జనవరి 21 : వాంకిడి మండలం బంబారలో గ్రామ సభకు అదనపు కలెక్టర్ దీపక్ తివారీ హాజరయ్యారు. ఆయన వెంట ప్రత్యేకాధికారి, తహసీల్దార్ రియాజ్ అలీ, డీఎల్పీవో ఉమర్‌హుస్సేన్, ఏఈవో పరిమళ, ఏపీఎం శ్రావణ్‌కుమార్, గిర్ధావర్ మాజిద్, కార్యదర్శి ధర్మ, అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.