ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 17: పోరాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధితో పాటు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. అనంతరం సాయిబాబా, దుర్గామాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు, చర్చిల్లో ప్రార్థనలు చేశారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు. దుర్గానగర్‌లోని అర్బన్‌పార్కులో మొక్కలు నాటారు. ఎమ్మెల్యే ఇంటి ఎదుట కార్యకర్తలు పటాకులు కాల్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్లు అజయ్, సత్యనారాయణ, జాదవ్ పవన్ నాయక్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బంగారుగూడలో సీఎం పేరు మీద మొక్కల ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. అనంతరం బేతాల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సాయిప్రణయ్, చంద నర్సింగ్, వెంకన్న, లక్ష్మణ్, జాదవ్ పవన్ నాయక్, మమత పాల్గొన్నారు.
బాలాజీ విద్యామందిర్‌లో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రంగినేని మనీషా ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి తినిపించారు.
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 17 : ఆదిలాబాద్ మండలం యాపల్‌గూడలో టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీజగదీశ్, వైస్‌ఎంపీపీ రమేశ్ , పీఏసీఎస్ చైర్మన్ పరమేశ్వర్ , నాయకుడు నరేశ్, సర్పంచ్ గంగారాం పాల్గొన్నారు.
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 17: చాంద(టీ) దర్గాలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అజయ్, నాయకులు యూనిస్ అక్బానీ, మమత, వెంకన్న, సర్పంచ్ భాస్కర్ పాల్గొన్నారు.
జైనథ్, ఫిబ్రవరి 17: మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తుమ్మల అరుంధతి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు లింగారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ పీ వెంకట్‌రెడ్డి, సర్పంచ్ దూల దేవన్న, నాయకులు గణేశ్, పురుషోత్తం యాదవ్, సుభాష్ యాదవ్, సంజీవ్‌రెడ్డి, రాజు, ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎదులాపురం, ఫిబ్రవరి 17 : సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మావల మండల కేంద్రంలోని బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఆర్సీవో రాథోడ్ గోపిచంద్ విద్యార్థినులతో కేక్ కట్ చేయించారు. విద్యార్థులు సైతం సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురుకులం ప్రిన్సిపాల్ అంజలికుమారి, వైస్‌ప్రిన్సిపాల్ స్వప్న, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
ఎదులాపురం, ఫిబ్రవరి 17: జిల్లా కేంద్రంలోని కేఆర్కే కాలనీలో గల వృద్ధాశ్రమంలో టీఎన్జీవోస్ నాయకులు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంద అశోక్, నవీన్ కుమార్, నాయకులు తిరుమల్ రెడ్డి, గోపి, చంద్రశేఖర్, తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు ఆడప మహేందర్, అరుణ్, వార్డెన్ ఉద్యోగుల జిల్లా కార్యదర్శి ఓం ప్రసాద్, సభ్యులు శ్రీనివాస్, సంజయ్ నరేశ్, కృష్ణ, శ్రీనివాస్, నవీన్, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
ఉట్నూర్, ఫిబ్రవరి 17 : మండల కేంద్రంలోని వికాసం పాఠశాలలో జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావు, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. విద్యార్థులతో కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో నాయకులు జాదవ్ సుమన్‌బాయి, మర్సుకోల సరస్వతి, తిరుపతి పాల్గొన్నారు.
ఉట్నూర్, ఫిబ్రవరి 15: మండల కేంద్రంలోని ఏఆర్ఎస్ కళాశాల ఆవరణలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ బాలాజీ, నాయకులు దాసండ్ల ప్రభాకర్, శారద, మనోహర్, రవి, సతీశ్, భూమన్న పాల్గొన్నారు.
నార్నూర్, ఫిబ్రవరి 17 : శేకుగూడ గ్రామంలోని రైతు వేదిక భవనంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కేట్ కట్ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ కనక మోతుబాయి, ఎంపీటీసీ ఏత్మాబాయి ధర్ము, నాయకులు కనక ప్రభాకర్, మాల్కుపటేల్, మానిక్రావ్, శ్రీరామ్, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 17 : మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎంపీపీ శోభాబాయి, ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్ డోంగ్రే, టీఆర్ఎస్ నాయకులు కలిసి కేక్ కట్ చేశారు. ఈశ్వర్‌నగర్ బాలాజీ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, ఎంపీటీసీ కోవ రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ కనక హనుమంత్‌రావ్, మాజీ సర్పంచ్ సుంకట్రావ్, టీఆర్ఎస్ నాయకులు మారుతి, సాయినాథ్, శ్యామ్, సీతారాం, తదితరులు పాల్గొన్నారు.