పంట నష్టం.. రైతన్నకు కష్టం..
ఇటీవల కురిసిన అకాల వర్షం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జొన్న, మొక్కజొన్న, పొగాకు, కంది, నువ్వులు, మిరప, వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి.
- 2,477 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
- అకాల వర్షాలతో ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలపై ప్రభావం
- నష్టాన్ని అంచనా వేసిన వ్యవసాయ శాఖ అధికారులు
- కాంగ్రెస్ సర్కారు ఇచ్చే రూ.15 వేల పరిహారంపై ఆశలు
మంచిర్యాల, మార్చి 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇటీవల కురిసిన అకాల వర్షం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జొన్న, మొక్కజొన్న, పొగాకు, కంది, నువ్వులు, మిరప, వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. అకాల వర్షాలు, ఈదురుగాలులకు చాలా ప్రాంతాల్లో పంటలు నేలకొరిగాయి. చేతికొచ్చే దశలో ఉన్న జొన్న, మొక్కజొన్న కండ్ల ముందే నేలమట్టమయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నేలకొరగడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో తీవ్రమైన నష్టం వాటిల్లింది. నాలుగైదు రోజులపాటు కురిసిన వర్షాలతో ఈ రెండు జిల్లాలో దాదాపు 2,477 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిళ్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు.
జొన్న రైతులకు నష్టం
- ఆదిలాబాద్ జిల్లాలో జొన్న 1,526 ఎకరాలు, మొక్కజొన్న 434, పొగాకు 26, వరి 11, నువ్వులు 36 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సిరికొండ మండలంలో 11, నేరడిగొండలో 4, బజార్హత్నూర్లో 5, ఇంద్రవెల్లిలో 5, గుడిహత్నూర్లో 7, ఆదిలాబాద్ రూరల్లో 5, గాదిగూడలో 4, ఇచ్చోడలో 20, ఇంద్రవెల్లిలో 7, జైనథ్లో 5, తలమడుగులో 7 మొత్తంగా 80 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
- మంచిర్యాల జిల్లాలో 69 ఎకరాల్లో వరి, 374.2 ఎకరాల్లో మొక్కజొన్న, ఎకరంలో నువ్వుల పంట దెబ్బతిన్నాయి. దండేపల్లి మండలంలో 13, లక్షెట్టిపేటలో 11, జన్నారంలో 6 ఎకరాల్లో మొత్తం 30 గ్రామాల్లో పంటలు నేలకొరిగాయి. ఉమ్మడి జిల్లాలో 1,900 ఎకరాల్లో జొన్న పంట దెబ్బతినడంతో సాగు చేసిన రైతులకు అరణ్యరోదనే మిగిలింది. మంచిర్యాల జిల్లాలో వరి నేలకొరిగింది.
- కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ స్వల్పంగా నష్టం వాటిల్లింది. ముఖ్యంగా చేతికొచ్చిన మిరప నాశనమైంది. బెజ్జూర్, కౌటాల, చింతలమానేపల్లి, సిర్పూర్ మండలాల్లో ఆరబెట్టిన మిరప అకాల వర్షాలకు నీటముగిగాయి. దీంతో పంట తడిసిపోయిందని రైతులు వాపోతున్నారు. ఎలాగైన పంట కొనుగోలు చేసిన తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
- కాగా.. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. గతంలో ఇదే సమయంలో వచ్చిన అకాల వర్షాలు, ఈ దురుగాలులకు పంట నష్టపోయిన రైతులకు కేసీఆర్ సర్కార్ రూ.10 వేల చొప్పున పరిహారం అందించింది. నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు అప్పుడు సాయం అం దింది. కానీ.ఇప్పుడున్న ప్రభుత్వం రైతులకు ఇచ్చిన వా గ్ధానాల్లో ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదు. రైతు భరోసా అం దరికీ ఇవ్వలేదు. అధికారంలోకి రాగానే చేస్తామన్న రుణమాఫీ ఊసే ఎత్తడం లేదు. దీంతో పంటలకు నష్టపరిహారం అందించడం ప్రకటనలకే పరిమితం అవుతుందా? లేక నిజంగానే రైతులకు పరిహారం అందజేస్తారా? అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తం అవుతున్నాయి.
ప్రభుత్వమే ఆదుకోవాలి..
నాకు ముంజంపల్లిలో 5.20 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో ఈ యేడాది మిర్చి వేశా. పంట బాగానే వచ్చింది. కానీ.. గత మంగళవారం రాత్రి సమయంలో వడగండ్ల వాన కురువడంతో కోసి ఎండబెట్టిన మిర్చి తడిసి ముద్దయింది. అదేవిధంగా చెట్టుపై ఉన్న మిర్చి కూడా పూర్తిగా రాలి.. నాణ్యత తగ్గింది. కొనుగోలుదారులు ధర పెట్టడం లేదు. తద్వారా నేను పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. దీంతో నాకు సుమారు రూ.3 లక్షల నష్టం వాటిల్లింది. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల ద్వారా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– తుమ్మిడె శంకర్, ముంజంపల్లి, రైతు
కోలుకోలేని దెబ్బ..
ఆరుగాలం కష్టపడి పంట చేతికందే సమయంలో అకాల వర్షం దెబ్బతీసింది. నేను నాకున్న రెండెకరాల్లో మిర్చి వేశా. పెట్టుబడిని పెద్ద మొత్తంలో పెట్టి పంట బాగానే రావడంతో మురిసి పోయా. కానీ.. వడగండ్ల వానతో ఆరబెట్టిన పంట తడిసి రంగు మారి నల్లబడింది. నాణ్యత కోల్పోవడంతో అనుకున్న ధర రాక నిరాశే మిగిలింది. రంగు మారిన మిర్చితో కొనుగోలు చేసే వారు కూడా తక్కువ ధర పెడతామంటున్నారు. నాకు సుమారు రూ.1.5 లక్షల నష్టం వాటిల్లింది. నష్టంపై ప్రభుత్వం సర్వేలు నిర్వహించాలి. పరిహారం మంజూరు చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నా.
– ఆబీద్ ఖాన్, కుకుడ, రైతు
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

