తాండూర్ : మండలంలోని గిరిజన గ్రామాల పరిధిలో హైలెవెల్ వంతెనలు( High-Level bridges) , రోడ్ డ్యాం ( Road Dams ) లు నిర్మించాలని ఆదివాసీ సంఘం నాయకులు సోమవారం తాండూర్ తహసీల్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష (Tribals protest ) చేపట్టారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ తాండూర్ మండల అధ్యక్షుడు కుర్సెంగ బాబురావు మాట్లాడారు.
సింగరేణి చెక్‌పోస్టు నుంచి నర్సాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిలో భీమన్న వాగుపై హైలెవెల్ బ్రిడ్జి, లచ్చుగూడ వద్ద మరో బ్రిడ్జి నిర్మించాలని కోరారు. వర్షాల వల్ల దెబ్బతిన్న కల్వర్టులు, రోడ్లు బాగు చేయాలని డిమాండ్ చేశారు. వరదలు వచ్చిన రోజు తాత్కాళిక చర్యలు చేపట్టి వదిలేయడం వల్ల ఆదివాసీ ప్రజానీకానికి ఇబ్బందులు తప్పడం లేదన్నారు.
అధికారులు స్పందించి వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోయం సురేష్, నైతం సోము, ఎల్ముల శ్రీను, సోయం పర్వత్, రావు, తుమ్రం జంగు, కుర్సెంగ లచ్చు, తొడసం జోగు, పోయం మోతీరాం, తుడుందెబ్బ, రాయ్ సెంటర్, నాయక్‌పోడ్, కొలాం, కౌలవార్, తోటి అనుబంద సంఘాల ఆదివాసీలు పాల్గొన్నారు.