కడెం : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం ఉచితంగా శిక్షణ ( Training ) అందిస్తున్నామని ఐటీడీఏ పీవో ఖుష్బు గుప్తా ( PO Khushbu Gupta ) అన్నారు. మండలంలోని పెద్దబెల్లాల్ గ్రామం రైతు వేదిక వద్ద శుక్రవారం నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత అవగాహన సదస్సును ( Awareness Programma ) నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్దబెల్లాల్, చిన్నబెల్లాల్, చిట్యాల మూడు పంచాయతీల పరిధిలోని మొత్తం 95 మందికి అవగాహన కల్పించినట్లు వివరించారు. సెక్యూరిటీ గార్డ్, కాగ్నీజెంట్, న్యాక్, ఎల్జీ, జీఎంఆర్ పౌండేషన్లలో శిక్షణ కల్పిస్తున్నామని వెల్లడించారు. అనంతరం డీ-మార్ట్, అమెజాన్, ఫ్లిప్‌కార్టు , జీఎంఆర్, ఎయిర్‌పోర్టు తదితర కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి 95 మంది హాజరై, ఆసక్తి చూపించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ జేడీఎం నాగభూషణ్, ప్లేస్మెంట్ మేనేజర్ వినోద్, జేఆర్పీ హిమాయత్ అలీ, నిరుద్యోగ యువతి,యువకులు పాల్గొన్నారు.