బెల్లంపల్లి/కాసిపేట, ఫిబ్రవరి 1 : కన్నాల బుగ్గరాజరాజేశ్వర స్వామి ఆలయ సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నది. నిత్యం ఏదో ఒక చోట కనిపిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నది. తాజాగా.. శనివారం లక్ష్మీపురంలో అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న తోకల తిరుపతికి చెందిన చేనులో పత్తి ఏరుతుండగా కూలీలకు పులి కనిపించడంతో భయంతో పరిగెత్తినట్లు వారు తెలిపారు.
అదే సమయంలో అడవి పందిపై దాడిచేసి చంపిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. శివారు ప్రాంతం కుంట రాములు బస్తీలో గల శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం శనివారం పాఠశాలకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించింది.
కాసిపేట మండల శివారులోని అటవీ ప్రాం తంలో పెద్దపులి, చిరుత పులి సంచరిస్తూ హ డలెత్తిస్తున్నాయి. కాసిపేట నుంచి బెల్లంపల్లికి వచ్చే నూతన సింగరేణి రోడ్డుతో పాటు బెల్లంపల్లి మండలం కన్నాల, బుగ్గగూడెం మార్గా న్ని ఫారెస్ట్ అధికారులు మూసి వేశారు. శనివారం కన్నాల శివారు బుగ్గకు వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో పులి అడవి పందిని హతమార్చింది.
ఫారెస్ట్ అధికారులు పెద్దపులి, చి రుత పులి ఒకే దారిలో సంచరించినట్లు గుర్తించారు. ఈ ప్రాంతంతో ఉండే దారుల్లో ఫారెస్ట్ అధికారులు పెట్రోలింగ్ చేస్తున్నారు. దుబ్బగూడెం పునఃరావస కాలనీలోగల మామిడితోట వద్ద పులిని ప్రత్యేకంగా చూసినట్లు స్టేషన్ పెద్దనపల్లికి చెందిన చుక్క సదయ్య తెలిపారు. పులి వెళ్లిపోయే వరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నామని చెప్పాడు.