ఇచ్చోడ(సిరికొండ), జూన్ 17 : ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పొన్న గ్రామానికి చెందిన రైతు నుగూరే పాండురంగ్ సిరికొండ సిరి సంపద వ్యవసాయ మార్కెట్ యార్డులో పురుగుల మందు ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ.. పంట కొనుగోలు చేయకుండా ప్రభుత్వమే హత్య చేసిందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆరోపించారు. బుధవారం రాత్రి పొన్న గ్రామానికి చేరుకొని రైతు కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మక్కలు, జొన్నలు కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. దీంతో రైతులు కొనుగోలు సక్రమంగా చేయకపోవడంతో చేసేది ఏమి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి ఎక్స్గ్రేషియా అందించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందన్నారు. రైతులు ఆత్మహత్యకు పాల్పడొద్దని, మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని భరోసా ఇచ్చారు. ఆయన వెంట నాయకులు ఓరగంటి పెంటన్న, సూర్యకాంత్, గణేష్, రమేష్ ఉన్నారు.