నార్నూర్ : గోదావరి నదిలో తెలంగాణ వాటాను వదులుకునే ప్రసక్తే లేదని బీఆర్ఎస్వీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్(Dharani Rajesh) అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు నార్నూర్ మండల కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు బనకచర్ల ప్రాజెక్టుపై (Banakacherla Project) అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం అక్రమ నీటి దోపిడీపై ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రజల వద్దకు తీసుకెళ్లి వివరించాలని తెలిపారు. కేసీఆర్ సారథ్యంలో నీళ్లు, నిధులు, నియామకాలే ఎజెండాగా తెలంగాణ ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రం సహకారమైన తర్వాత కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రాంతం పచ్చని మణిహారంగా తయారైందని వెల్లడించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి నది నుంచి 200 టీఎంసీలను అక్రమంగా తరలించే కుట్రలు చేస్తున్నారని తెలిపారు. ఇంతపెద్ద కుట్ర జరుగుతున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కుట్రలను తిప్పికొట్టకుండా వారి అడుగులకు మడుగులు వత్తుతు కుట్రకోణానికి సహకరిస్తున్నారని అన్నారు. గోదావరి, కృష్ణ నదుల యాజమాన్య బోర్డులు, కేంద్ర జల సంఘం అనుమతుల్లేకుండా అపెక్స్ కౌన్సిల్లో చర్చలు జరగకుండా ప్రాజెక్ట్ నిర్మించారదని అన్నారు. కార్యక్రమంలో నాయకులు సూర్యవంశి, శేషు, రాథోడ్ , శివాజీ బోస్లె, సంతోష్, ప్యాక్స్ చైర్మన్ ఆడే సురేష్, పట్టణ అద్యక్షులు ఫెరోజ్ ఖాన్, జడే దయానంద్, విలాస్ పవర్, మోహన్ ఆడే సుభాష్ తదితరులు పాల్గొన్నారు.