కడెం, డిసెంబర్ 12: రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, గెలిచిన సర్పంచ్‌లు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనులు చేపట్టాలని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్‌నాయక్ సూచించారు. కడెం మండలంలో పలు గ్రామాల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు లింగాపూర్‌కు చెందిన కుమ్మరి రంజిత్, దిల్దార్నగర్కు చెందిన బద్దెనపల్లి స్టీఫెన్, కొండుకూర్‌కు చెందిన మామిడిపెల్లి భీమేశ్, లక్ష్మీసాగర్‌కు రాజునాయక్, కొత్తమద్దిపడగకు చెందిన జడ లావణ్యకృష్ణ, పాతమద్దిపడగకు చెందిన ఆకుల శకుంతలరామాగౌడ్ సర్పంచులుగా గెలుపొందారు. వీరంతా శుక్రవారం ఖానాపూర్‌లో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్‌నాయక్‌ను కలిశారు. సర్పంచులకు జాన్సన్‌నాయక్ శుభాకాంక్షలు తెలిపి, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
దస్తురాబాద్, డిసెంబర్ 12 : దస్తూరాబాద్ మండలంలో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు దేవునిగూడెం ఎండపెల్లి గంగన్న, ఆకొండపేట మాధవీశంకర్, ఎర్రగుంట భూక్యా పద్మ కలిరాం సర్పంచులుగా విజయం సాధించారు. శుక్రవారం బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా వారు కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. నమ్మి ఓటు వేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సర్పంచ్‌లకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉప సర్పంచ్ గంగన్న, భూక్యా రాజు నాయక్, గోవర్ధన్, రాజు, లక్ష్మణ్, శ్రీకాంత్, వెంకటేశ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
ఖానాపూర్, డిసెంబర్ 12: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో 25 గ్రామ పంచాయతీలకు 5 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 20 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా 8 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. ఈ సందర్భంగా శుక్రవారం ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల కార్యకర్తలు ఖానాపూర్లోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు చేసి కృషి అభినందనీయమన్నారు.