2023-24 వానకాలం సీజన్‌కు సంబంధించి పంట ఉత్పత్తుల మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించింది. పత్తికి ఏ-గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ.7,020, బీ-గ్రేడ్‌కు రూ. 6,620, వరికి ఏ-గ్రేడ్‌కు క్వింటాలుకు రూ. 2,203, సాధారణ రకానికి రూ.2,183, జొన్నలకు రూ. 3,180, సజ్జలకు రూ. 2,500, రాగికి రూ. 3,846, మక్కకు రూ. 2,090, కందులకు రూ. 7,000, పెసర్లకు రూ. 8,558, మినుములకు రూ. 6,950, వేరుశనగకు రూ. 6,377, సోయాబీన్‌కు రూ. 4,600, నువ్వులకు రూ. 8,635, పొద్దుతిరుగుడుకు రూ. 6,760గా నిర్ణయించింది.
– కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 10
కుమ్రం భీం ఆసిఫాబాద్/మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : 2023-24, వానకాలం సీజన్‌కు సంబంధించి పంట ఉత్పత్తుల మద్దతు ధరలను కేంద్రం ప్రకటించింది. సీసీఐ ద్వారా కొనుగోలు చేసే పత్తి ధర ఏ-గ్రేడ్‌కు క్వింటాలుకు రూ. 7,020 నిర్ణయించగా, బీ-గ్రేడ్‌కు క్వింటాలుకు రూ. 6,620 నిర్ణయించింది. గతేడాది క్వింటాలుకు రూ. 6,660 నిర్ణయించింది. గతేడాది సీసీఐ నిర్ణయించిన ధరకంటే ప్రైవేటు వ్యాపారులు అధిక మొత్తంలో చెల్లించి కొనుగోలు చేశారు. ప్రైవేట్ వ్యాపారులు రూ. 7,500 నుంచి రూ. 8,000 దాకా చెల్లించి కొనుగోలు చేశారు. వరికి ఏ-గ్రేడ్ రకానికి క్విం టాలుకు రూ. 2,203, సాధారణ రకానికి రూ.2,183 ఎఫ్‌సీఐ నిర్ణయించింది.
వరి, పత్తి పంటలతో పాటు ఇతర పంటలకు మద్దతు ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది. జొన్నలు క్వింటాలుకు రూ. 3,180, సజ్జలు రూ. 2,500, రాగి రూ. 3,846, మక్కరూ. 2,090, కందులు రూ. 7,000, పెసర్లు రూ. 8,558, మి నుములు రూ. 6,950, వేరుశనగ రూ. 6,377, సోయాబీన్ రూ. 4,600, నువ్వులు రూ. 8,635, పొద్దుతిరుగుడు రూ. 6,760గా నిర్ణయించింది. పత్తికి కనీసం క్వింటాలుకు రూ. 10 వేల మద్దతు ధర చెల్లించి సీసీఐ ద్వారా కొనుగోలు చేసే తప్ప రైతులకు మేలు జరుగదని అంటున్నారు. వరికి కనీసం క్వింటాలుకు రూ. 3 వేలు నిర్ణయించాలని రైతులు కోరుతున్నారు.
జిల్లా రైతాంగం పత్తి పంట సాగుకే ప్రాధాన్యమిస్తున్నది. వాణిజ్య పంటల సాగులో అధికంగా లాభాలు వస్తాయనే ఆలోచనతో రైతులు ఆహార ధాన్యాల పంటలను సాగు చేయడం తగ్గిస్తున్నా రు. జిల్లా గతంలో వరి, గోధుమ, మక్క, జొన్న, పెసర, మినుములు, శనగ, చిక్కుడు, కంది పం టలను అధిక మొత్తంలో సాగుచేసేవారు. మారుతున్న పరిస్థితులను బట్టి ఆహార పంటలు తగ్గిపోతున్నాయి. వాణిజ్య పంటైన పత్తిని ఎక్కువగా సాగు చేసేందుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో గతేడాది వానకాలం సీజన్లో 3.36 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేశారు. ప్రస్తుతం వానకాలంలో 3లక్షల 37 వేల 548 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. జిల్లాలో మొత్తం పంటలు 4 లక్షల 51 వేల 778 ఎకరాల్లో సాగవుతుంటే.. ఇందు లో పత్తి అత్యధికంగా వేస్తున్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా కొనుగోలు చేసే పత్తి, ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలుచేసే వరి పంటలకు కనీస స్థాయిలో గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.