భీంపూర్, డిసెంబర్ 23 : కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ క్రమంగా బీఆర్ఎస్లో చేరికల సంఖ్య పెరుగుతున్నదని రానున్నది బీఆర్ఎస్ సర్కారే అనేందుకు ఇదే నిదర్శనమని బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ అన్నారు. నేరడిగొండలోని ఎమ్మెల్యే నివాసంలో భీంపూర్ మాజీ సర్పంచ్ మడావి లింబాజీ సహా 110 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం బీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
బీఆర్ఎస్లో చేరిన ముఖ్య నాయకులలో నైతం రాము, గెడాం రాము, పునాజీ, నైతం శేకు తదితరులున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రేణులకు దిశానిర్దేశనం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఐక్యతగా ఉండాలని, ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి పోరాడాలన్నారు. పార్టీలో వర్గాలుగా విడిపోతే సహించేది లేదని ఎమ్మెల్యే అన్నారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పినట్లుగా ఓడిన అభ్యర్థులు కూడా ధైర్యంగా ఉంటూ సమస్యల పరిష్కారంలో ముందుండాలన్నారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకూ పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందని గుర్తుచేశారు. ఆదివాసీ గూడేలను పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనా తీరుపై రైతులు సహా అన్ని వర్గాల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచులుగా పెద్ద సంఖ్యలో గెలిచారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, గుంజాల సర్పంచ్ వినోద్, నాయకులు కేమ శ్రీకాంత్, కేమ గంగయ్య, కుడిమెత సంతోష్, గడ్డం లస్మన్న, జీ నరేందర్‌యాదవ్, బొంత నితిన్, బక్కి కపిల్యాదవ్, అశోక్, గుండా ప్రకాశ్‌యాదవ్, పెంట నితిన్, గోప మహేందర్, మేకల బక్కన్న తదితరులున్నారు.
భీంపూర్ మాజీ సర్పంచ్ మడావి లింబాజీ, మాజీ ఉపసర్పంచ్ జాదవ్ రవీందర్ సర్పంచు ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఇద్దరూ సర్పంచ్ బరిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. వీరు సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాను బీఆర్ఎస్ పార్టీని వీడకుంటే గెలిచేవాడినని లింబాజీ బాధపడ్డాడు. బోథ్ ఎమ్మెల్యే కార్యదక్షత, బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణ చూసే తిరిగి పార్టీలో చేరినట్లు ఆయన చెప్పారు.