మండలంలోని ఎల్లూరు గ్రామంలో బొకివాగుపై గత 12 సంవత్సరాల క్రితం బొకి వాగు ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం నిర్మించింది. దాదాపు 2000 ఎకరాల పంట సాగుకు నీరు అందించడమే ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. దానికి రెండు కుడి,ఎడమ కాలువలను ఏర్పాటు చేసి పంట పొలాలకు నీరు అందిస్తున్నారు. ప్రాజెక్టుకు దిగువన ఎల్లూరు, కోయాసిచ్చాల వ్యవసాయ భూములు గల రైతులు పంటలు సాగు చేస్తున్నారు.
వానకాలం సీజ న్లో 1000 ఎకరాలు, యాసంగి పంట దాదాపు 300 ఎకరాల్లో సాగుకు రైతుల సిద్ధమవుతున్నారు. రెండు కాలువలు అకడకడ గోడలు కూలిపోవడంతోపాటు కాలువలలో కోరేగడ్డి విపరీతంగా పెరిగింది. మరోవైపు తూములు సరిగా మూయకపోవడంతో కాలువల గుం డా నీరు వృథాగా పోతున్నది. దీంతో ప్రాజెక్టులో ఉన్న నీరు యాసంగికి సరిపోతుందా..? పంటలు వేయా లా..వద్దా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
12సంవత్సరాల క్రితం 2000ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెంచికల్పేట్ మండలంలోని ఎల్లూర్లో బొక్కివాగు ప్రాజెక్టు నిర్మించారు. దానికి కుడి, ఎడమ రెండు కాలువలు ఏర్పాటు చేసి పంట పొలాలకు నీరు అందిస్తున్నారు. అయితే రెండు కాలువలు అక్కడ క్కడ గోడలు కూలిపోవడమే కాకుండా కాలువల నిండా కోరేగడ్డి పేరుకపోయింది. కొంతమంది రైతులు ఇష్టారీతిగా తూములు తెరిచి సరిగా మూయక పోవడంతో నిత్యం నీరు కాలువల గుండా వృథాగా పోతున్నది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాలువలకు మరమ్మతులు చేసి, నీటిని వదిలేందుకు ఒక నీరటిని నియమించాలని రైతులు కోరుతున్నారు.
– పెంచికల్పేట్,డిసెంబర్ 20
ప్రాజెక్టు నుంచి రైతుల పంట పొలాలకు కాలువల ద్వారా నీరు రావలసిన కుడి ,ఎడమ కాలువల గోడలు అకడకడ కూలిపోతున్నాయి. మరోవైపు కాలువల్లో విపరీతంగా కోరగడ్డి పెరిగింది. కాలువలకు మరమ్మతులు చేపించి కోరే గడ్డి తొలగించాలి. రైతుల పంటకు నీరు అందేవిధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
-ఎల్లయ్య యువరైతు,ఎల్లూరు
బొకి వాగు ప్రాజెక్టు కుడి కాలువ నిత్యం నీరు పారుతూ వృథాగా పోతున్నది. తూము ఒకరు బంద్ పెడితే మరోకరు తెరుస్తున్నారు. పంటలకు అవసరం లేకున్నా నీరు వదులుతున్నారుప్రాజెక్టు నీటిని వదిలేందుకు ఒక నీరటిని ఏర్పాటు చేసి నీరు వృథాగా పోకుండా అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి.
-చంద్రయ్య రైతు ,ఎల్లూరు
నా పేరు చెన్నబోయిన చిన్నన్న బొకి వాగు ప్రాజెక్టు దిగువనే ఐదు ఎకరాల భూమి ఉన్నది. దాంట్లో వరి సాగు చేస్తూ ఏటా రెండు పం ట లు పండిస్తున్నాను. నీటిని వది లేందుకు నీరటి లేకపోవడంతో కొంతమంది రైతులు అవసరం లేకున్నా తూము గేటు తెరిచి నీటిని వృథా చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో నీరు తగ్గిపోతుంది. ఈ సంవత్సరం చివరి దశలో ప్రాజెక్టు నీరు యాసంగి పంటకు సరిపోతుందా..అని సందేహంగా ఉంది. నీటిని వదిలేందుకు నీరటిని నియమించాలి
– చిన్నన్న రైతు ,ఎల్లూరు