కోటపల్లి : శివరాత్రి సందర్భంగా గోదావరి నదిలోకి (Godavari River ) పుణ్యస్నానానికి వెళ్లి గల్లంతయిన రాదండి రాజేష్ (50) అనే వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామానికి చెందిన రాజేష్ బుధవారం నదిలోకి పుణ్యస్నానం కోసం వెళ్లి గల్లంతయ్యాడు. కోటపల్లి ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా గురువారం మృతదేహం లభించింది. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించినట్టు ఎస్సై రాజేందర్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.