ఎదులాపురం, ఫిబ్రవరి 10: రెండేళ్లయిన రూ.2500 ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని.. పోలీసులు కాం గ్రెస్, బీజేపీ ప్రభుత్వాల మధ్య నలిగిపోతూ కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టడం సమంజసం కాదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా మావలలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓటరు మహాశయులకు బీఆర్ఎస్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఒకపక రైతులు పంటలు నష్టపోయి, సంక్షేమ పథకాలు అందక తీవ్ర సంక్షోభాన్ని ఎదురొంటున్నా.. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ వారికి ఏమి సంబంధం లేదన్నట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.
ఇదంతా మరిచి కేవలం ఏయిర్ పోర్ట్పై దృష్టి సారిస్తూ సీసీఐ భూములు అమ్ముకొనే ఆలోచన చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని రూ.4000 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. కాంగ్రెస్, బీజేపీల పై ఉన్న వ్యతిరేకతను డబ్బులు, మద్యంతో ఓట్లు దండుకొనే ఆలోచన చేయడం తగదన్నారు. ఇజ్జగిరి నారాయణ, ముకెర ప్రభాకర్, మద్దుల ఆశన్న, కొంశటి కేశవ్, ఉమాకాంత్రెడ్డి, ఆసిఫ్, గంగుల కిరణ్, గిరిప్రసాద్, సృజన్, సుధీర్ పాల్గొన్నారు.