ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి
భైంసాటౌన్, జూన్, 7 : రాష్ట్ర ప్రభుత్వం ప్ర జాసేవే లక్ష్యంగా పాలన అందిస్తున్నదని ము థోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. మం డల పరిషత్ కార్యాలయంలో మంగళవారం 150 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కు లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు.
మహిళల ఆర్థికాభివృద్ధికి కృషిచేస్తున్నదన్నారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు. ఎంపీపీ కల్పనాజాదవ్, వైస్ ఎంపీపీ గంగాధర్, తహసీల్దార్ సూర్యప్రకాశ్, ఎంపీడీవో గంగాధర్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.