తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజాప్రతినిధులు తమవంతు సహాయ, సహకారాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు సమకూరుస్తుండగా.. చిన్నచిన్న వాటి కోసం సేవా ధృక్పథంతో సాయం చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్షలో సూచించారు. నేరడిగొండ మండలంలో శిబిరాల నిర్వహణకు రూ.32వేలు ఖర్చు చేస్తానని జడ్పీటీసీ అనిల్ జాదవ్.. బోథ్ మండలంలో రవాణా, భోజనం ఖర్చులు భరిస్తానని ఎంపీపీ తుల శ్రీనివాస్ తెలిపారు. అలాగే ఆదిలాబాద్ బల్దియాలో నిర్వహించే శిబిరాలకు వాహనాల ద్వారా ప్రజలను జోగు ఫౌండేషన్ తరఫున తరలిస్తానని చైర్మన్ ప్రేమేందర్.. ఆదిలాబాద్ పట్టణంలో ఆటో ద్వారా ఐదు వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తానని కౌన్సిలర్ అలాల్ అజయ్ పేర్కొన్నారు.
ఆదిలాబాద్, జనవరి 12 ( నమస్తే తెలంగాణ) : కంటి వెలుగు మొదటి విడుత కార్యక్రమం విజయవంతం కావడంతో ఈ నెల 18 నుంచి రెండో విడు త ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిం ది. 100 రోజుల పాటు ఇది కొనసాగనున్నది. ఈ కార్యక్రమంలో వైద్యనిపుణులు పట్టణాలు, గ్రామా ల్లో కంటి వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించనున్నారు. అంధత్వాన్ని నివారించే బృహత్తరమైన ఈ కార్యక్రమ నిర్వహణలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు తమవంతు సహాయ, సహకారాలు అందించేందుకు ముందుకొచ్చారు. జిల్లాలోని మారుమూల గ్రామాలు, ఏజెన్సీ గూడే లు, తండాల్లోని ప్రజల కండ్లలో వెలుగులు నింపడానికి సాయం అందిస్తామని ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశారు.
కంటివెలుగు పేదలకు ఎం తో ఉపయోగపడుతుంది. సీఎం కేసీఆర్ చేప్టటిన ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. సే వా ధృక్పథంతో ప్రతిఒక్కరూ పాల్గొనాలి. ము న్సిపల్ పరిధిలో 49 వార్డుల్లో నిర్వహించే నేత్ర వైద్యశిబిరాలకు జోగు ఫౌండేషన్ తరఫున వార్డుల్లోని ప్రజలందరికీ కంటి పరీక్షలు జరిగేలా చర్య లు తీసుకుంటాం. వైద్యాశాఖ అధికారుల తో చ ర్చించి వారికి అవసరమైన సహా య, సహకారాలు అందిస్తాం. ప్రజలు శిబిరాలకు హాజరయ్యేలా మున్సిపత్ వాహనాల ద్వారా ప్రచారం విషయంలో నిర్ణయం తీసుకుంటాం.
– జోగు ప్రేమేందర్, మున్సిపల్ చైర్మన్, ఆదిలాబాద్
దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో పేదల కండ్లల్లో వెలుగులు నింపేందుకు చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. బోథ్ మండలంలో మారుమూల గ్రామాలు, ఆదివాసీ గూడేలు, తండాలు చాలా ఉన్నాయి. కంటి వెలుగులో భాగంగా నేత్ర పరీక్షలు నిర్వహించే గ్రామాలకు రావాలంటే వైద్య సిబ్బంది ఇబ్బందులు పడతారు. దీంతో అందరికీ కంటి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండదు. ఈ సమస్య పరిష్కారం కోసం నా వంతు సాయం చే యాలని నిర్ణయించుకున్నా. మా మండలంలో 33 గ్రామ పంచాయతీలుండగా.. వీటిల్లో నిర్వహించే కం టి పరీక్షల కోసం గ్రామాల నుంచి ప్రజలు రావడానికి అయ్యే ఖర్చులు భరిస్తా. వారికి భోజనం, తాగునీ రు, ఇతర సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తా. కొంత మంది యువకులను నియమించుకొని ఈ శిబిరా లు నిర్వహించే చోటుకు తీసుకువెళ్తాం. వైద్య సిబ్బంది ఇచ్చిన మందులు, కళ్లద్దాల వాడకం గురించి తెలియజేస్తాం.
– తుల శ్రీనివాస్, ఎంపీపీ, బోథ్
ప్రభుత్వం పేదల కంటిచూపు సమస్య పరిష్కారం కోసం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం బృహత్తరమైనది. కంటి చూపు సరిగా లేక పేద కుటుంబాలకు చెందిన వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేట్ దవాఖానలకు పోయి చికిత్సలు చేయించుకోలేని పరిస్థితి వారిది. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలుచేస్తే మంచి ఫలితాలుంటాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఆలోచనలో చేపట్టిన ఈ కార్యక్రమంలో నేను భాగస్వామ్యమవుతున్నా. గ్రామాల్లో నేత్ర వైద్యశిబిరాల నిర్వహణకు నా వంతుగా సాయం అందించాలనుకుంటున్నా. నేరడిగొండ మండలంలో 32 గ్రామ పంచాయతీలుండగా.. ప్రతి పంచాయతీకి వేయి రూపాయల చొప్పున రూ.32 వేలు వైద్యశాఖ అధికారులకు అందజేస్తా. ఈ డబ్బు శిబిరాల నిర్వహణకు కొంతవరకైనా ఉపయోగపడుతుందని భావిస్తున్నా.
– అనిల్‌జాదవ్, జడ్పీటీసీ, నేరడిగొండ
పేద ప్రజలు కంటి చూపు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించి వారికి మెరుగైన దృష్టిని కల్పించడానికి అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ప్రతి ఒక్కరికీ ఉపయోగపడాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి. నా తరఫున ఆటో ద్వారా ఐదు వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తా. ప్రజలు ఎక్కువ సంఖ్యలో నేత్ర వైద్యశిబిరాలకు హాజరయ్యేలా చూస్తా. శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
– అలాల అజయ్, కౌన్సిలర్, ఆదిలాబాద్ మున్సిపాలిటీ