ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ షురూ
సర్కారు బడుల్లో హెచ్ఎంలు, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ మొదలైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేటగిరీ(1,2,3)ల వారీగా పాఠశాలల్లో ప్రస్తుత ఖాళీల జాబితా, గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత కలిగిన ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను శుక్రవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో
మంచిర్యాల, జనవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సర్కారు బడుల్లో హెచ్ఎంలు, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ మొదలైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేటగిరీ(1,2,3)ల వారీగా పాఠశాలల్లో ప్రస్తుత ఖాళీల జాబితా, గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత కలిగిన ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను శుక్రవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు. ఈ జాబితా ప్రకారమే ప్రమోషన్లు, బదిలీలను ఆన్లైన్ ద్వారా పూర్తి పారదర్శకంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఉపాధ్యాయులు 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, అనంతరం దరఖాస్తు ప్రతులను ఉన్నతాధికారులకు అప్పగించాలని స్పష్టం చేశారు. ఒకసారి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాక వాటిని మార్చుకునే అవకాశం ఉండదని, దీనిని దృష్టిలో ఉంచుకొని దరఖాస్తు చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు.
జిల్లాల వారీగా..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 1900 ప్రధా నోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విధులు నిర్వ హిస్తుండగా, ఇందులో 242 మందికి తప్పనిసరిగా స్థాన చలనం కలగనున్నది. 160 మందికి పదోన్న తులు వచ్చే అవకాశమున్నది. ఆదిలాబాద్ జిల్లాలో 1,044 మంది హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు ప దోన్నతులు, బదిలీలు నిర్వహించనుండగా, ఇం దు లో 541 మంది తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ కావా ల్సి ఉంది. నిర్మల్ జిల్లాలో 615 మందికి పదోన్నతులు, బదిలీలు నిర్వహించనుండగా, ఇందులో సుమారు 250 మంది తప్పనిసరిగా స్థానచలనం పొందాల్సి ఉంది. మంచిర్యాల జిల్లాలో 847 మం దికి పదోన్నతులు, బదిలీలు నిర్వహించనుం డగా, ఇందులో 612 మంది తప్పనిసరిగా స్థానచలనం పొందాల్సి ఉంది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత ఈ సంఖ్యల్లో మార్పు ఉండే అవకాశముంది.
మార్గదర్శకాలు ఇవీ..
- ప్రభుత్వ, లోకల్‌బాడీ పాఠశాలల్లో పని చేసే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఫిబ్రవరి 1వ తేదీ 2023 వరకు ప్రస్తుత కేటగిరీలో కనీసం రెండేళ్ల సర్వీసును ఒకే పాఠశాలలో పూ ర్తి చేసుకొని ఉండాలి. వారే బదిలీకి అర్హులు.
- ప్రభుత్వ, లోకల్‌బాడీలో పని చేసే ప్రధానోపాధ్యాయులు ఫిబ్రవరి 1, 2023 వరకు ప్రస్తుత కేటగిరీలో ఒకే పాఠశాలలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా బదిలీ అవుతా రు. ఒకవేళ మూడేళ్లలోపు బదిలీ అయ్యే ప్రధానోపాధ్యాయులైతే వారి కోరిక మేరకు ట్రాన్స్ఫర్ జరుగుతుంది.
- ఉపాధ్యాయులు ఫిబ్రవరి 1, 2023 వరకు ప్రస్తుత కేటగిరీలో ఒకే పాఠశాలలో ఎనిమిదేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్నైట్లెతే తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. అలాంటి వారికి మూడేళ్లలోపు బదిలీ అయ్యే వారైతే వారి కోరిక మేరకు బదిలీ చేస్తారు.
- బాలికల ఉన్నత పాఠశాల్లో ఫిబ్రవరి 1, 2023వ తేదీ వరకు 50 సంవత్సరాల వ యసు కంటే తక్కువ ఉన్న పురుష హెచ్ఎం లు/ఉపాధ్యాయులు తప్పనిసరి బదిలీఅవుతారు.
- ఒకవేళ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేసేందుకు మహిళా హెచ్ఎంలు/ఉపాధ్యాయులు అందుబాటులో లేని సందర్భంలో 50 ఏండ్లు దాటిన పురుష ఉపాధ్యాయులు/ హెచ్ ఎంలకు అవకాశం ఇస్తారు.
- ఎన్సీసీ అధికారులుగా పనిచేసే హెచ్ఎంలు/ఉపాధ్యాయులు ఐదు నుంచి ఎనిమిదేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు ఎన్సీసీ యూనిట్ ఉన్న పాఠశాలకే బదిలీ అవుతారు.

Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

