ఉట్నూర్, మే 5 : మండల కేంద్రానికి చెందిన రాయ్ మనోజ్ నీట్ పరీక్ష బాగా రాయలేదనే మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు, పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని అంగడిబజార్ మెయిన్ రోడ్డులో నివాసముంటున్న ఉపాధ్యాయుడు రాయ్ గంగాధర్ కుమారుడు రాయ్ మనోజ్(19) లాంగ్‌టర్మ్ కోచింగ్ హైదరాబాద్‌లో తీసుకున్నాడు. నీట్ పరీక్ష రాసి సోమవారం ఇంటికి చేరుకున్నాడు.
ఉదయం ఆన్లైన్లో మార్కులను పరిశీలించాడు. తనకు తక్కువగా వ స్తాయని గ్రహించి మనస్తాపంతో పడుకుంటానని చెప్పి వెళ్లి ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు. వస్తువులు పడిపోయిన విషయాన్ని గ్రహించిన తల్లితంద్రులు అటువైపు వెళ్లి చూసే సరికి ఫ్యాన్‌కు ఉగులాడుతూ కనిపించాడు. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉట్నూర్ సీఐ తెలిపారు.