కామారెడ్డి, ఆగస్టు 20: కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. విద్యార్థి సేన ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. కళాశాలలో వెయ్యి మంది దాకా చదువుతున్నప్పటికీ 10 తరగతి గదులు మాత్రమే ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు లేకపోవడంతో బోధనకు ఆటంకం కలుగుతుందని తెలిపారు. సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మికార్ వినయ్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు పాషా, కార్యదర్శి అశ్విని, నోమన్, వికాస్, మీనాక్షి, హేమశ్రీ, ప్రణయ్, రాణి, రిత్విక్, విద్యార్థులు పాల్గొన్నారు.