గాంధీనగర్: లగ్జరీ బస్సుకు చెందిన హైడ్రాలిక్ డోర్లో బాలుడి తల ఇరుక్కున్నది. ఈ నేపథ్యంలో ఆ బాలుడు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లో కొంత రికార్డ్ మిస్ కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (boy neck struck in bus door, dies) గుజరాత్‌లోని వడోదరలో ఈ సంఘటన జరిగింది. ఒక ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు రిపేర్ కోసం శివారు ప్రాంతంలోని గ్యారేజీ వద్ద పార్క్ చేసి ఉన్నది.
కాగా, బుధవారం సాయంత్రం ఆ ప్రాంతంలో నివసించే కూలీ కుటుంబానికి చెందిన ఏడేళ్ల దివ్వేష్ రాత్వ ఆ బస్సు వద్ద ఆడుకున్నాడు. అయితే ఆ బస్సు హైడ్రాలిక్ డోర్లో బాలుడి తల ఇరుక్కుపోయింది. ఇంటి వద్ద ఉన్న గ్యారేజీ యజమాని సీసీటీవీ ద్వారా దీనిని గమనించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు సిబ్బంది వాహనంలో అక్కడకు చేరుకున్నారు. బస్సు హైడ్రాలిక్ డోర్‌ను గట్టిగా తోయగా తల ఇరుక్కున్న బాలుడు కిందపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఆ గ్యారేజీ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. బాలుడి తల ఇరుక్కోవడానికి ముందు, ఇరుక్కున్న తర్వాత మాత్రమే సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఆ మధ్యలో ఏం జరిగిందో అన్నది రికార్డ్ కాలేదు. ఈ నేపథ్యంలో బాలుడి మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Vadodara Boy Dies After Neck Gets Trapped in Bus Door; Parts of CCTV Footage Missinghttps://t.co/eYaguNUjsE pic.twitter.com/OTkIJzSB1o
— DeshGujarat (@DeshGujarat) August 20, 2026