ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్ 19 : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు అక్రమ రవాణాపై నిఘా పెట్టాలని, నిషేధిత మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సురేశ్‌కుమార్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫ్రెన్స్ హాలులో అన్ని పోలీస్స్టేషన్ల సి బ్బందితో నెలవారీ నేర సమీక్ష నిర్వహించా రు. ఆయన మాట్లాడుతూ పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కేసుకు సంబంధించిన ప్రతి విషయాన్ని రికార్డుల్లో భద్రపరచాలన్నారు.
ఎన్నికల నేపథ్యంలో నదీ తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఓటరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హకు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులపై మర్యాదగా వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ అడ్మిన్ ప్రభాకర్‌రావు, ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య, కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలు, ఆర్ఐలు, డీసీఆర్బీ, ఐటీ, విభాగాల ఎస్ఐలు, డీపీవో సి బ్బంది, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.