ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, అక్టోబర్ 29 : జైనూర్ ఆదివాసీ మహిళ పై అత్యాచారానికి యత్నించి జైనూర్ ఘటనకి కారణమైన నిందితుడు ముగ్దుంపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ఎస్పీ డివి శ్రీనివాస్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.
సోమవారం నిందితుడిపై చర్లపల్లి జైలులో ధ్రువీకరణ పత్రాలు అందజేసినట్లు తెలిపారు. నేరాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా తప్పించుకోలేరని ప్రజలు ఎవరు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని తెలిపారు.