Shaurya Diwas | నార్నూర్, జనవరి 1 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాలలోని ముల్లంగి, కొత్తపల్లి హెచ్, తాడిహత్నూర్, దుప్పాపూర్, లోకరికే, ధాబా, మారేగావ్, గుండాల, బుద్ధగూడా, మేడిగూడతోపాటు దళిత వాడల్లో గురువారం శౌర్య దివస్ విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భీమా కోరేగావ్ యుద్ధంలో పీష్వాలపై వీరోచితంగా పోరాడి అసువులు బాసిన మహార్వీరులకు శ్రద్ధాంజలి ఘటించి సౌర్యసూస్థాపానికి నివాళి అర్పించారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు, చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు లోకండే చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 1818 జనవరి 1న భీమా కోరేగావ్ గ్రామంలో సమానత్వం, ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటంలో కేవలం 500 మంది మహార్ సైనికులు 28 వేల మంది పీష్వా సైన్యాన్ని ఓడించారన్నారు. ఈ ఘటనలు 22 మంది మహార్ సైనికులు వీరమరణం పొందారు.
పీష్వా, మహార్ల మధ్య జరిగిన యుద్ధంలో విజయం సాధించినందున అప్పటినుంచి జనవరి 1న శౌర్య దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ యుద్ధంలో మృతి చెందిన సైనికులకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బానోత్ గజానంద్ నాయక్, మాజీ జెడ్పీటీసీ హేమలత బ్రిజ్జిలాల్, కేశవ్, విట్టల్, సునీల్, మొబైల్, దయానంద్, యువకులు, మహిళలు ఉన్నారు.
Air India | విమానం టేకాఫ్‌కు ముందు పైలట్ వద్ద మద్యం వాసన.. అరెస్ట్