Nandipet | నందిపేట్: నందిపేట్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో పింఛన్ పంపిణీ కేంద్రాలను గురువారం ప్రారంభించారు. మొన్నటి వరకు మండల కేంద్రం మొత్తానికి కలుపుకొని ఒక పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వద్దనే పింఛన్ల పంపిణీ జరిగేది. వేలాది మంది లబ్ధిదారులు బారులు తీరి నిలబడి పోయేవారు. తోపులాటల కారణంగా పోలీసుల బందోబస్తుతో పంపిణీ జరిగేది.
పంపిణీ కౌంటర్ లు నందిపేట్ లో ఐదు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అందులో భాగంగా గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటుచేసిన రెండు కౌంటర్లను గ్రామ సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం, ఉప సర్పంచ్ వాసవి రామచందర్ చేతుల మీదుగా పంపిణీ కౌంటర్లను ప్రారంభించారు. ఐదు చోట్ల కౌంటర్లు ఏర్పాటు చేయడంతో వెళ్లిన వెంటనే పింఛన్ డబ్బులు అందుతున్నాయని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.