బెల్లంపల్లి, ఆగస్టు 12 : పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ దాగం శ్రీకాంత్ డిమాండ్ చేశారు. బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ ఫీజులు విద్యార్థులే చెల్లించాలని , ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడికి గురిచేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోలేటి అజయ్, అభిషేక్, రామ్చరణ్, తేజ, విద్యార్థులు పాల్గొన్నారు.