ఉట్నూర్, ఏప్రిల్ 13 : ప్రభుత్వ నిషేధిత గంజాయితో యు వత జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కొందరు మత్తు లో మరణిస్తుండే మరికొందరు అధిక సంపాదన ఆశతో సరఫరా చేస్తూ పట్టుబడి జైలుపాలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల కరీంనగర్, హైదరాబాద్, జగిత్యాల్ వంటి పట్టణాల్లో గంజాయి కేసులు నమోదు కాగా.. వాటి ములాలు మనవద్దే ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఇటీవల ముమ్మర తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల్లో ఏకంగా పదికిలోల గంజాయి పట్టుకోవడమే కాకుండా పది మందిపై కేసు కూడా నమోదు చేశారు. ఏజెన్సీలో రైతులు పండిస్తే వారిపై కేసు లు నమోదు చేయడమే కాకుండా.. వారికి ప్రభుత్వ పథకాలైన రైతుబం ధు, సబ్సిడీ విత్తనాలు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు రాకుండా చర్యలు తీ సుకుంటున్నారు. అమాయక గిరిజనులు గంజాయితో నష్టపోకుండా ఉడేందుకు పోలీసులు మీకోసం పేరిట గంజాయిపై గిరిజన గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేశారు. అలాగే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మూడు రోజుల్లో పది మందిపై కేసులు
మండలంలోని కుమ్మరితండా పరిధిలోని రాముగూడలో దాడులు నిర్వహించి కుమ్ర సోనేరావు ఇంటి వెనుకాల ఉన్న అరటి పెరడిలో సుమారు 20 గంజా యి మొక్కలను ధ్వంసం చేశారు. రైతుపై కేసు నమోదు చేయడమే కాకుండా ప్రభుత్వ పథకాలు రాకుండా కలెక్టర్ ప్రతిపాదించారు. అలాగే పట్టణం మీదు గా ఆటోలో ముగ్గురు వ్యక్తులు రెండు కిలోల గంజాయి తరలిస్తున్నారన్న స మాచారంతో ఐటీడీఏ సమీపంలో ఆటోను తనిఖీ చేసి బేల మండలంలోని పార్సువాడకు చెందిన మారుతి విక్రయించగా అతనితోపాటు మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశా రు. అలాగే ఇటీవల మండలంలోని బీర్సాయిపేట్కు చెందిన ఎల్లయ్యతో మండలంలోని లక్షేటిపేట్కు చెందిన గంగన్న ఐదు కిలోల గంజాయిని మ హారాష్ట్ర నుంచి కొనుగోలు చేసి అధిక ధరలకు కరీంనగర్, హైదరాబాద్‌లో విక్రేయించేందుకు సి ద్ధంగా ఉండడంతో పోలీసులు దాడులు చేసి వారిని రిమాండ్‌కు పంపారు. అలాగే ఇటీవల మండలంలోని ఎక్స్‌రోడ్ పెట్రోల్ పంప్ వద్ద పల్సర్ బైక్‌పై జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన అనిల్, గౌతం లు ఆదిలాబాద్ మండలం అశోర గ్రామంకు చెంది న రాహు వద్ద కిలోన్నర గంజాయిని కొనుగోలు చేసి తరలిస్తుండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. ఇలా మొత్తానికి పది మందిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు.
అవగాహన కార్యక్రమాలు
గంజాయి పండిస్తూ, అమ్ముతూ జీవితాలను నాశ నం చేసుకోవద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ము మ్మరం చేశారు. కళాజాత టీంలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గంజాయి సేవించడం ద్వారా అనారోగ్యం పాలు కావడం, రోడ్డు ప్రమాదాలు, పోలీసు కేసులు కావడం, అసాంఘిక కార్యకలాపాలు జరగడం వంటి వాటిపై పోలీసులు గిరిజన పెద్దలకు అవగాహన కల్పిస్తున్నారు. దీని ద్వారా యువత చెడు మార్గంలో నడవకుండా పెద్దలు అడ్డు పడతారని భావిస్తున్నారు.
యువత చెడు మార్గాలకు దూరంగా ఉండాలి..
యువత ఉన్నత లక్ష్యాలతో మంచి మార్గాలలో పయనించాలి. ఇటీవల గంజాయి కేసులలో అధి క భాగం యువత ఉండడం చాలా బాధాకరం. అందుకే గంజాయితో జీవితాలు నాశనం చేసుకో వద్దని ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ కాజల్ సింగ్ ఆదేశాలతో గ్రామాలలో పెద్దలకు అవగాహన కల్పిస్తున్నాం. గంజాయి కేసులో కనీసం బెయిల్ కూడా దొరకదన్న విషయాన్ని వివరిస్తున్నాం. ఇటీవల పలు కేసులలో ఏజెన్సీ ప్రాంతం వారికి లింకులు ఉన్న విషయాన్ని గ్రహించాం. వెంటనే ఏజెన్సీలో అమాయక గిరిజనులు గంజాయి భారిన పడకుండా ముమ్మరంగా దాడులు నిర్వహి స్తున్నాం. రైతులు పండిస్తే వారిపై కేసులు నమోదు చేస్తూ గంజాయి పంటను నాశనం చేస్తు న్నాం. రైతులకు ప్రభుత్వ పథకాలు రాకుండా అధికారులకు వివరాలు పంపుతున్నాం. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ మెరుగైన జీవితం గడపాలన్నదే తమ లక్ష్యం. దీనికోసం పోలీసులకు సహకరించాలని, యువత సన్మార్గంలో నడపాలని కోరుతున్నాం. – ఉట్నూర్ సీఐ మొగిళి