జైనథ్, మార్చి 10 : మహిళల విద్య కోసం ఏనలేని కృషి చేసిన సావిత్రిబాయి ఫూలేను ఆదర్శంగా తీసుకోవాలని ప్రధానోపాధ్యాయుడు సత్యవాన్ చిక్టే అన్నారు. మండలంలోని మేడిగూడ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో గురువారం సావిత్రిబాయి ఫూలే వర్ధంతి నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మంజూష, జ్యోతి, నాందేవ్, సంతోష్, దేవీదాస్, ఊశన్న, పవన్, ఛత్రపతి, పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.
బోథ్, మార్చి 10 : సావిత్రిబాయి ఫూలే ఆశయాలు సాధించాలని వీడీసీ చైర్మన్ గంగాధర్ అన్నారు. మండల కేంద్రంతో పాటు సొనాల గ్రామంలో గురువారం సావిత్రిబాయి ఫూలే వర్ధంతి నిర్వహించారు. ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సొనాలలో మహాజన యూత్ సభ్యులు రాజలింగు, ప్రవీణ్‌కుమార్, రవితేజ, చిన్నయ్య, వినోద్ పాల్గొన్నారు. బోథ్‌లో మంచికుంట సతీశ్, అనిల్, అధ్యాపకులు సంజీవ్‌రెడ్డి, అనిల్‌కుమార్, నాందేవ్, లక్ష్మణ్, నగేశ్, బాబులాల్, విద్యార్థులు పాల్గొన్నారు.
తాంసి, మార్చి 10 : బడుగుబలహీన వర్గాల మహిళలు చదువుకునేందుకు పోరాడిన సావిత్రిబాయి ఫూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సర్పంచ్ కృష్ణ అన్నారు. మండల కేంద్రంతో పాటు గిరిగాం, కర్ల గ్రామాల్లో మాలీ సంఘం నాయకులు సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, మాలీ సంఘం నాయకులు గంగారాం, రమేశ్, పరమేశ్, గిరిగాంలో మాలీ సంఘం నాయకులు గంగారాం, ధనుంజయ్, ఉత్తమ్, అమృత్, యువకులు పాల్గొన్నారు.
ఎదులాపురం, మార్చి 10 : విద్యతోనే మహిళల అభివృద్ధి సాధ్యమని తెలంగాణ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు శోభ తుల్జాపూరే అన్నారు. జిల్లా కేంద్రంలోని కైలాస్‌నగర్‌లో గల అశోక్ బుద్ధవిహార్‌లో సావిత్రిబాయి ఫూలే వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబా సాహెబ్ కాంబ్లే, నరహరి కాంబ్లే, రామకృష్ణ, ప్రేమకళ, తదితరులు పాల్గొన్నారు.
తలమడుగు, మార్చి 10 : కుచులాపూర్ గ్రామంలో మాలీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే వర్ధంతి నిర్వహించారు. ఫూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాలీ సంఘం నాయకులు రాములు, జనార్దన్, వామన్, శంకర్, రాందాస్, తదితరులు పాల్గొన్నారు.