జూలై 12 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల గురించి చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ అదివారం ఒక ప్రకటనలో పేరొన్నారు. రైతు పంటలకు నీళ్లు ఎలా అందిస్తారని అడిగిన ప్రశ్నకు రైతుల మనోభావాలను దెబ్బతీసేలా స్పందించడం సమంజసం కాదని అన్నారు. రైతులను కోసి పంటల మీద రక్తం చల్లితే అదే పండుతుంది అనే తరహాలో ముఖ్యమంత్రి స్పందించడం రైతులను అవమానించడమేనన్నారు. అన్నం పెట్టే రైతును గౌరవించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని, అలాంటి రైతుల గురించి ముఖ్యమంత్రి స్థాయిలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రైతాంగాన్ని అవమానించడమేనని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమాల ద్వారా సాధించుకున్న రాష్ట్రం అని, ఇకడ బెదిరింపులు, దబాయింపుల సంస్కృతికి స్థానం లేదన్నారు. ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవం విలువైన తెలంగాణలో రైతు చెమటతోనే ఈ నేల సస్యశ్యామలం అవుతుందని రైతు రక్తంతో కాదని స్పష్టం చేశారు. రైతుల మనోభావాలను దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి వెంటనే భేషరతుగా రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతు ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రతి వ్యాఖ్యను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని పేరొన్నారు. రాబో యే రోజుల్లో రైతు వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక పాలనకు తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. రైతు గౌరవాన్ని కాపాడే వారినే ప్రజలు ఆదరిస్తారని, ప్రజా కోర్టులో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే సరైన సమాధానం ఇస్తారని భూక్యా జాన్సన్ నాయక్ పేరొన్నారు.