రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించాలి
గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు.
- నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
నిర్మల్ టౌన్, జనవరి 23 : గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ ప్రవీణ్‌కుమార్, అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీస్టేడియంలో వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో పరేడ్‌ను సిద్ధం చేయాలని, అవసరమైన స్టాళ్లను ఏర్పాటు చేసుకోవాలని, పోలీసు భద్రత చర్యలను చేపట్టాలని సూచించారు.
జంతు సంరక్షణపై చైతన్యం చేయాలి…
అటవీశాఖ ఆధ్వర్యంలో జంతు సంక్షేమం, సంరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించేలా ప్రజలను చైతన్యం చేయాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. జంతు సంక్షేమం, ప్రాధాన్యతను వివరించి, అడవులను సంరక్షించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ‘జంతు సంక్షేమం పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత’ అనే అంశంపై రూపొందించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
‘కంటి వెలుగు’ లోపాలు సరిదిద్దుకోవాలి..
జిల్లాలో అమలు చేస్తున్న ‘కంటి వెలుగు’ శిబిరంలో లోపాలు లేకుండా ఆన్లైన్లో అన్ని వివరాలను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కంటి వెలుగు పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19 నుంచి నిర్మల్ జిల్లాలో కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శిబిరాల్లో ఇప్పటివరకు పరీక్షలు చేసుకున్న వారి సంఖ్య, కళ్లద్దాల పంపిణీ, క్యాంపుల నిర్వహణ, క్యాంపుల వద్ద మౌలిక సదుపాయలు, ఆన్లైన్ డేటా, తదితర అంశాలపై వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్, వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

