శ్రీశైలం, ఆగస్టు 10 : శ్రీశైల జలాశయానికి వరదనీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతున్నది. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టుల నుంచి మూడు రోజులుగా క్రమక్రమంగా నీటి విడుదల నిలిపివేయడంతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం నిలకడగా ఉన్నది. సోమవారం జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 23,455 క్యూసెక్కుల నీరు విడుదల కాగా సాయంత్రానికి 40,218 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు వచ్చి చేరుకున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుతం 878.90 అడుగులు ఉన్నది. అదే విధంగా పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 182.60 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్లు నమోదయ్యాయి. అదే విధంగా కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని నిలిపివేయగా ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేసి 35,315 క్యూసెక్కుల నీటిని అవుట్ ఫ్లోగా దిగువన ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేశారు.
శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఆ రేండ్లుగా అనేకమార్లు మరమ్మతులు పూర్తి చేసుకున్న నా ల్గో యూనిట్ ఎట్టకేలకు పునఃప్రారంభమైంది. 72 గంటల పాటు ట్రయల్న్ నిర్వహించనున్నట్లు జెన్కో అధికారులు ప్రకటించారు. ఆరేండ్ల కిందట జరిగిన ప్రమాదంలో నాల్గో యూనిట్లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయినప్పటి నుంచి జాతీయ స్థాయి సంస్థల సహకారంతో యూనిట్లో మరమ్మతులు పూర్తి చేసి సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
గద్వాల, ఆగసు ్ట10 : ఎగువ నుంచి జూరాల వరద పూ ర్తిగా తగ్గి పోవడంతో జూరాల అధికారులు జూరాల గేట్లను పూర్తి స్థాయిలో మూసి వేశారు. భీమా నది నుంచి 35వేల క్యూసెక్కుల వరద జూరాలకు వస్తుంది. అయితే ఇందులో విద్యుదుత్పత్తికి 23,445 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318.20 మీటర్లు ఉన్నది. ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ లెవల్ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 9.009 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టుకు 35,000 క్యూస్కెల వరద నమోదవుతుండగా అవుట్ ఫ్లో 28,599 క్యూసెక్కులుగా నమోదైంది.
అయిజ, ఆగస్టు 10 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతోంది. సోమవారం టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 42.450 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 1,757 క్యూసెక్కులు నమోదైంది. టీబీ డ్యాం గరిష్ట స్థాయి నీటి మట్టం1633 అడుగులకు గాను, ప్రస్తుతం 1625.82 అడుగుల నీటి మట్టం ఉండగా, 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గాను, ప్రస్తుతం 79.201 టీఎంసీల నీటి నిల్వ ఉందని డ్యాం సెక్షన్ అధికారి కిరణ్ తెలిపారు.