కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 20(నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ దందా జోరుగా సాగుతున్నది. జిల్లా సరిహద్దు మండలాల నుంచి బియ్యాన్ని తరలిస్తున్నారు. కొన్ని చోట్ల లబ్ధిదారులు బియ్యం తీసుకుని వీధి వ్యాపారులకు విక్రయిస్తున్నారు. మరికొన్ని చోట్ల డీలర్లు లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండానే నేరుగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. స్థానికంగా కిలోకు రూ.12 కొనుగోలు చేసి, మహారాష్ట్రలో రూ.20లకు విక్రయిస్తున్నారు.
ద్విచ క్ర వాహనాలు, ఆటోలు, చిన్న వ్యాన్లలో తరలించి జిల్లా సరిహద్దులోని గోదాముల్లో డంప్ చేస్తారు. అక్కడి నుంచి భారీ వాహనా ల్లో గొందియా, బల్లార్షలోని రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న బి య్యాన్ని పట్టుకునేందుకు చెక్‌పోస్టులు లేవు. ఎవరైనా పట్టుకుంటే చేతి తడిపితే చాలు. బి య్యం తరలించే వాహనాలు తెల్లవారు జా మున, రాత్రి వేళల్లో మహారాష్ట్రలో ఉంటా యి. టాస్క్‌ఫోర్స్ అధికారులు కేసులు నమో దు చేస్తున్నప్పటికీ, అక్రమార్కుల దందా ఆగ డం లేదు. తాజాగా టాస్క్‌ఫోర్స్ అధికారులు పెంచికల్పేట్లో ఓ వ్యాపారి ఇల్లు సోదాలు చే సి 15 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు.