బెల్లంపల్లి : వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల ( Seasonal Diseases ) పట్ల ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎం అండ్ హెచ్వో ( Deputy DMHO) సుధాకర్ నాయక్ వైద్య సిబ్బందిని కోరారు. ఇంటిగ్రేటేడ్ హెల్త్ క్యాంపెయిన్లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తీ, సుభాష్ నగర్ బస్తీలలో బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు.
ఆర్బీఎస్కే, ఎంపీహెచ్ఏ, ఆశ, ఐసీటీసీ, ఎమ్ఎస్ఐసీటీసీ కౌన్సెలర్, ఎన్డీవో పీఎం, బృందం సభ్యులు ప్రజలకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు మరింతగా పెంచి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో వంద రోజుల పాటు శిబిరాలు కొనసాగుతాయని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో మెడికల్ అధికారి ఇవాంజెలిన్, ఆర్బీఎస్కే టీమ్ వైద్యుడు జుబేర్, రుక్మిణి, దిశ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ నీలిమా, డెమో వెంకటేశ్వర్లు, మొబైల్ ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్ అలేఖ్య, కౌన్సెలర్ శ్రీలత, ఐసీటీసీ కౌన్సెలర్ జగన్మోహన్, ప్రగతి చందన , ప్రాజెక్ట్ వర్క్ మేనేజర్ వెంకటేష్, శశికాంత్, లియాబ్, టెక్నీషియన్ మురళీ, తదితరులు పాల్గొన్నారు.