కాసిపేట : మాజీ సీఎం కేసీఆర్ ( KCR) పై అక్రమ కేసులు విచారణ పేరుతో సిట్ నోటీసులను ( SIT notices ) నిరసిస్తూ బీఆర్ఎస్ ( BRS ) నాయకులు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన నిర్వహించారు. కాసిపేట మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. రాస్తారోకో చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాసిపేటలోని అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందించారు.
దేవాపూర్, కొండాపూర్ యాపలో నల్ల బ్యాడ్జిలు ధరించి ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవాపూర్ లో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొల్లు రమణారెడ్డి, ఆత్రం మహేష్, సింగని రాజకుమార్, గోనె రవి, కైలాష్, అటకపురం రమేష్, మచ్చ అనిల్, కొంగ విజయ్, అఫ్జల్, వెంకటేష్, శ్రావణ్, దేవాజీ, దుర్గం రాజేష్, లవన్, గిరి, ఖదీర్, హైదర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కాసిపేటలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు అగ్గి సత్తయ్య, మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి యాదవ్, నాయకులు రాంటెంకి వాసుదేవ్, జాడి రాంచందర్, సత్రవేణి మల్లేష్, లంక లక్ష్మణ్, అజన్న, సూర్య ప్రకాష్, మోహన్ సురేష్, శ్రీనివాస్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.